అన్వేషించండి

AI and Healthcare : ఆస్పత్రుల్లో AI వినియోగం పెరిగితే వైద్యులపై పనిభారం తగ్గొచ్చు.. కానీ రోగులకు మంచిదా? కాదా? రద్దీ పెరుగుతుందా?

AI and Hospitality : భారతదేశంలో ఆరోగ్య సేవలపై ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ సమయంలో రోగుల రద్దీ తగ్గించడానికి, వైద్యులపై భారం తగ్గించడానికి AI ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? నిపుణులు ఏమంటున్నారంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కృత్రిమ మేధస్సు ఆసుపత్రి రద్దీ, నిరీక్షణ సమయం తగ్గిస్తుంది.
  • AI వైద్యులకు పరిపాలనా పనిభారం తగ్గించి, సమయం ఆదా చేస్తుంది.
  • AI రోగి లక్షణాలు విశ్లేషించి, సరైన చికిత్సకు నిర్దేశిస్తుంది.
  • సాంకేతికతతో పాటు వైద్యుల నైపుణ్యం, సానుభూతి అత్యంత ముఖ్యం.
AI Reduce Healthcare Burden in India : భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక రోగుల జనాభా ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులపై భారీ ఒత్తిడి ఉంటోంది. దీంతో ఆస్పత్రికి వెళ్తే గంటల తరబడి వేచి ఉండాలి. ముఖ్యంగా అవుట్‌పేషెంట్ విభాగాల్లో ఈ రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. నిపుణులైన వైద్యుల కొరత, పరిపాలనా పనిభారం, దీర్ఘకాలిక వ్యాధుల పెరుగుదల వంటి కారణాలతో రోగులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య రంగంలో రోగుల రద్దీని తగ్గించడానికి, చికిత్స అందించడానికి కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI)
కీలక సహాయక సాధనంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు.
 
వైద్య రంగంలో ఏఐ వినియోగం గురించి యశోద హాస్పిటల్స్​లో క్లినికల్ డైరెక్టర్, ఆంకాలజీ విభాగం & సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్​గా చేస్తోన్న డాక్టర్ సచిన్ మార్దా స్పందించారు. సచిన్ ప్రకారం AI అనేది వైద్యులను భర్తీ చేయడానికి రాలేదు. వైద్యులు, నర్సులు తమ సమయాన్ని ఎక్కువగా రోగుల సంరక్షణకు కేటాయించేందుకు సహాయపడేలా చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. 
పేషెంట్లతో వైద్యులు ఎక్కువ సమయం గడపవచ్చు.

ఆటోమేటిక్ రిమైండర్లు

ఆస్పత్రుల్లో అపాయింట్‌మెంట్ల నిర్వహణ, రోగుల నమోదు, మెడికల్ రికార్డ్స్, రిపోర్ట్స్ తయారీ, ఫాలోఅప్ రిమైండర్లు పంపించడం వంటి పనులను AI వేగంగా, సమర్థవంతంగా నిర్వహించగలుగుతుందని తెలిపారు. దీని వల్ల వైద్యులు, స్టాఫ్ కంప్యూటర్ స్క్రీన్ ముందు గడిపే సమయం తగ్గి, రోగులతో మరింత సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ఆరోగ్య సేవల నాణ్యత పెరగడంలో ఇది కీలకంగా మారవచ్చని డాక్టర్ సచిన్ తెలిపారు.

రోగుల రద్దీ ఎలా తగ్గుతుంది?

రోజులో ఏ సమయంలో ఎక్కువ మంది రోగులు వస్తున్నారు? ఏ విభాగంలో ఎక్కువ రద్దీ ఉంది? ఎక్కడ జాప్యం జరుగుతోంది? వంటి అంశాలను AI సులభంగా విశ్లేషించగలదు. ఈ సమాచారంతో ఆస్పత్రి యాజమాన్యం ముందుగానే ప్రణాళికలు రూపొందించి అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచవచ్చు. దీని వల్ల రద్దీ తగ్గడంతో పాటు వైద్యులను కలిసేందుకు, పరీక్షలు చేయించుకోవడానికి, అడ్మిషన్ పొందడానికి పట్టే సమయం కూడా చాలావరకు తగ్గే అవకాశం ఉంటుంది.

వైద్యుడి దగ్గరకు త్వరగా వెళ్లొచ్చు 

భారతదేశంలో చాలా మంది రోగులు నేరుగా పెద్ద ఆస్పత్రులకు వెళ్లడం వల్ల అక్కడ అధిక రద్దీ ఏర్పడుతోంది. కొన్నిసార్లు ఏ విభాగానికి వెళ్లాలో తెలియక అనవసరంగా ఒక డాక్టర్ నుంచి మరొక డాక్టర్ వద్దకు తిరుగుతారు. అలాంటప్పుడు AI ఆధారిత ట్రయాజ్ వ్యవస్థలు రోగి లక్షణాలను విశ్లేషించి అతడిని సరైన విభాగం లేదా నిపుణుడి దగ్గరికి పంపించగలవు. దీంతో అనవసర రిఫరల్స్ తగ్గి, రోగికి సరైన చికిత్స త్వరగా అందే అవకాశం పెరుగుతుంది.

వైద్యులపై పనిభారం తగ్గొచ్చు 

AI ఆధారిత వాయిస్-టు-టెక్స్ట్ సిస్టమ్స్ వైద్యుడు చెప్పిన విషయాలను ఆటోమేటిక్‌గా రికార్డు చేసి మెడికల్ నోట్స్‌గా మార్చగలవు. దీంతో పేపర్‌వర్క్ తగ్గి వైద్యుల పనిఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా బర్నౌట్ సమస్యను ఎదుర్కొంటున్న ఆరోగ్య సిబ్బందికి ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చని డాక్టర్ సచిన్ అన్నారు. 

AI ఒక్కటే పరిష్కారం కాదు

AI ఎంత అభివృద్ధి చెందినా వైద్యుడి అనుభవం, క్లినికల్ నిర్ణయాలు, రోగి పట్ల సానుభూతి, నైతిక విలువలు, వైద్యుడు-రోగి మధ్య నమ్మకాన్ని భర్తీ చేయలేడు. సాంకేతికత అనేది ఒక సహాయక సాధనంగా మాత్రమే చూడాలని నిపుణులు అంటున్నారు. అలాగే AI సమర్థవంతంగా పనిచేయాలంటే బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, డేటా భద్రత, స్పష్టమైన నియంత్రణ వ్యవస్థలు, నిరంతర పర్యవేక్షణ అవసరమని.. ఇవి లేకపోతే ఆశించిన ఫలితాలు రావడం కష్టమని అంటున్నారు.

ఆరోగ్య సేవల్లో AI కీలక పాత్ర

AIని సరైన విధంగా వినియోగిస్తే ఆస్పత్రుల్లో వేచి చూసే సమయాన్ని తగ్గించడమే కాకుండా.. రోగులకు మెరుగైన అనుభవాన్ని అందించగలదు. అలాగే ఇండియాలో ఈ మధ్యకాలంలో ఏఐ సేవలతో సర్జరీలు, చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ మార్పుల్లో సాంకేతికత ఎంత ముఖ్యమో, వైద్యుల పాత్ర కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని మర్చిపోకూడదని నిపుణులు చెప్తున్నారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget