అన్వేషించండి

Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?

Testosterone Screening After 30:అమెరికా ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లు దాటిన సైనికులకు టెస్టోస్టెరాన్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి చేసింది. US ఎందుకు ఇలాంటి టెస్టులు చేస్తోంది?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికా సైన్యంలో 30 ఏళ్లు పైబడిన వారికి టెస్టోస్టెరాన్ స్క్రీనింగ్ తప్పనిసరి.
  • సైనికుల దీర్ఘకాలిక ఆరోగ్యం, మానసిక శారీరక ఫిట్‌నెస్ లక్ష్యంగా నిర్ణయం.
  • వయసు ఆధారిత పరీక్షలు, త్వరిత TRTపై వైద్య నిపుణుల సందేహాలు.
  • వైద్య పర్యవేక్షణ లేకుండా TRT తీసుకోవడం ప్రమాదకరమని హెచ్చరిక.

Testosterone Screening After 30:యాక్టివ్‌నెస్, పిట్‌నెస్, బలంగ గురించి చర్చకు వచ్చినప్పుడు కచ్చితంగా టెస్టోస్టెరాన్ ప్రస్తావన వస్తుంది. దీని స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే వారు అంత బలంగా ఉంటారని ప్రచారం ఉంది. దీన్ని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. అయినా దీనిపై ఉన్న అపోహలు పోవడం లేదు. ఒక వ్యక్తి శక్తి కేవలం టెస్టోస్టెరాన్‌పై కాకుండా వారి డైలీ రొటీన్, తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ వాదన ప్రచారంలో ఉన్న టైంలో అమెరికా ఆర్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లు దాటిన సైనికులంతా కచ్చితంగా టెస్టోస్టెరాన్ స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 

అయితే టెస్టోస్టెరాన్ స్క్రీనింగ్ పరీక్షలు వేనుక సైనికుల ఆరోగ్యం సంరక్షణ దాగి ఉందని అమెరికా ఆర్మీ చెబుతోంది. అమెరికా ఏ చెప్పినా సరే ఇప్పుడు ఆ దేశం తీసుకున్న నిర్ణయంతో టెస్టోస్టెరాన్‌పై చర్చ మొదలైంది. 

30 ఏళ్లు దాటిన వారికి టెస్టోస్టెరాన్ స్క్రీనింగ్ పరీక్షలు 

సైనికులకు ఏటా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం అక్కడ సాధారణంగా జరుగుతుంది. అయితే ఈసారి ఆ పరీక్షల్లో టెస్టోస్టెరాన్ స్క్రీనింగ్ పరీక్షను చేర్చారు. ఇది 30 ఏళ్లు దాటిన ప్రతి సైనికుడు చేసుకోవాలని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ చెప్పారు. 30 ఏళ్ల లోపు ఉన్న వారు కూడా తమ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. ఈ పరీక్షల్లో తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయి తక్కువ ఉన్నట్టు తేలిన వారికి ప్రత్యేకంగా టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థరెపీ ఇస్తారు. 

ఈ పరీక్షలు, థెరపీ అనేది సైనికుల పని తీరును మెరుగుపరచడానికి కాదని హెగ్సెత్‌ చెప్పారు. సైనికుల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. శారీరకంగా, మానసికంగా వారంతా ఎప్పుడూ ఫిట్‌గా ఉండేలా చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. హార్మోల్ లోపాలు ముందుగానే పసిగడితే వారు అనారోగ్యం బారిన పడకుండా ఉండటమే కాకుండా వారి ఆరోగ్యంతోపాటు ఆర్థికంగా కూడా ఆదుకునే వాళ్లం అవుతామని వివరించారు. 

అమెరికా ఆర్మీ తీసుకొచ్చిన కార్యక్రమం సైనికుల్లో హార్మోన్‌ల తగ్గుదలను గుర్తించేందుకు తీసుకొచ్చామని చెబుతున్నారు. అయితే దీన్ని వైద్యరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. దీని కోసం వయసు ఆధారంగా పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ హార్మోన్‌ల ఉత్పత్తి స్థాయి తగ్గుతుందని వివరిస్తున్నవారు. అందులో భాగంగా టెస్టోస్టెరాన్ స్థాయిలో తగ్గుదలన కనిపిస్తుందని పేర్కొంటున్నారు. దీనికి కేవలం రక్త పరీక్ష ద్వారా హార్మోన్‌ల తగ్గుదలను నిర్దారించలేమని మరిన్ని పరీక్షలు, పరిశీలన అవసరమని అంటున్నారు. 

టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ఎవరు ఎప్పుడు తీసుకోవాలి?

టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అనేది ఎవరు ఎప్పుడుపడితే అప్పుడు తీసుకునేది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. హార్మోన్‌ల లోపం ఉందని నిర్ధిష్ట పరీక్షలతో నిర్దారణ అయిన తర్వాత మాత్రమే, వైద్యుల పర్యవేక్షణలో ఈ TRT తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే పనితీరు మెరుగుపరుచుకోవడానికి గానీ, వృద్ధాప్యాన్ని జయించాలనే ఆలోచనతో ఇలాంటి థెరపీలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారి పని తీరును మెరగుపరిచేందుకు చేసే చికిత్స కాదని స్పష్టం చేస్తున్నారు. 

TRT ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే ఎందుకు ప్రమాదం?

ఈ టీఆర్టీ వైద్యుని సలహా మేరకే తీసుకోవాలి. లేకుంటే వైపరిత్యాలు చాలా దారుణంగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల సహజంగా ఉత్పత్తి అయ్యే హార్మోన్లు దెబ్బతింటాయని చెబుతున్నారు. మొటిమలు, వంధ్యత్వం, ఎర్రరక్తకణాలు పెరగడం వంటి ప్రమాదకరమైన సమస్యలు వెంటాడుతాయి. 

గమనిక: ఈ సమాచారం పరిశోధన అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయంపై ఆధారపడి ఉంది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా కొత్త కార్యాచరణ చేపట్టే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Frequently Asked Questions

అమెరికా ఆర్మీ 30 ఏళ్లు పైబడిన సైనికులకు టెస్టోస్టెరాన్ స్క్రీనింగ్ ఎందుకు తప్పనిసరి చేసింది?

సైనికుల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని, శారీరక, మానసిక ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. హార్మోన్ లోపాలు ముందుగా గుర్తించి వారి ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యం.

టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (TRT) ఎప్పుడు తీసుకోవాలి?

హార్మోన్ల లోపం ఉందని నిర్దిష్ట పరీక్షలతో నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో TRT తీసుకోవాలి. పనితీరు మెరుగుపరచుకోవడానికి లేదా వృద్ధాప్యాన్ని జయించడానికి దీనిని తీసుకోకూడదు.

వైద్య సలహా లేకుండా TRT తీసుకుంటే కలిగే ప్రమాదాలు ఏమిటి?

సహజంగా ఉత్పత్తి అయ్యే హార్మోన్లు దెబ్బతింటాయి. మొటిమలు, వంధ్యత్వం, ఎర్రరక్తకణాలు పెరగడం వంటి ప్రమాదకరమైన సమస్యలు ఏర్పడవచ్చు.

30 ఏళ్లు పైబడిన వారికి వయసు ఆధారంగా టెస్టోస్టెరాన్ స్క్రీనింగ్ అవసరమని వైద్య నిపుణులు భావిస్తున్నారా?

లేదు, వైద్య నిపుణులు వయసు ఆధారంగా స్క్రీనింగ్ అవసరం లేదని తప్పుబడుతున్నారు. హార్మోన్ల తగ్గుదలను కేవలం రక్త పరీక్షతో నిర్ధారించలేరని, మరిన్ని పరిశీలనలు కావాలని చెబుతున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
Kidney Disease : కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget