అన్వేషించండి

పాములు పాలు తాగవు కదా, మరి ఈ సామెత ఎందుకు పుట్టింది? శాస్త్రీయ వాస్తవాలు తెలుసుకోండి!

Naga Panchami 2026: హిందూ మతంలో పాములను పవిత్రమైనవిగా కూడా భావిస్తారు. అందువల్ల, నాగ పంచమి, నాగుల చవితి రోజు పాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పాములు పాలు తాగవు కదా ఈ సామెత ఎక్కడి నుంచి వచ్చింది?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నాగులపూజలో పాములకు పాలు పోయడం శాస్త్రీయంగా తప్పు.
  • లాక్టోజ్ జీర్ణానికి అవసరమైన ఎంజైమ్‌లు లేక, పాలు ప్రాణాంతకం.
  • పాములు పట్టేవారి క్రూరత్వం, దాహంతో పాలు తాగించడం అపోహ.

Snake Milk Myth Science Beliefs: ఏటా నాగపంచమి, నాగుల చవితి వచ్చేసరికి పాములకు సంబంధించిన చాలా విషయాలు , నమ్మకాలు, అపోహలపై చర్చలు జరుగుతూనే ఉంటాయ్. ఏటా శ్రావణ మాసంలో కొన్ని ప్రాంతాల్లో నాగపంచమి జరుపుకుంటారు..ఈ రోజులు పుట్టలో పాలుపోసి నాగదేవతను పూజిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో కార్తీకమాసంలో వచ్చే నాగులచవితి రోజు పాలు పోస్తారు. అయితే  పాములకు పాలు పోస్తారు కానీ అవి తాగవు కదా? అయినా ఎందుకు అనే చర్చ జరుగుతూనే ఉంటుంది. పాములు పగ తీర్చుకుంటాయని కొందరు నమ్ముతారు..అయితే విజ్ఞానశాస్త్రం ఈ వాదనలన్నింటినీ పూర్తిగా ఖండించి, వాటిని పూర్తిగా కల్పితాలుగా పరిగణిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. పాముకు పాలు తాగవు కదా..మరి ఈ నానుడి ఎక్కడి నుంచి వచ్చింది?

Dream Astrology: కలలో పాములు, దేవాలయాలు, నదులు కనిపిస్తే..దాని వెనుక కారణం ఏంటో తెలుసా?

'పాము పాలు తాగినా విషమే కక్కుతుంది'

పాములు పాలు తాగినా విషపూరిత, హింసాత్మక స్వభావం మారదని దీని అర్థం. దీనికి అక్షరార్థం ఒక దుష్ట వ్యక్తిని పోషించడం లేదా శత్రువుకు మేలు చేసినా వారు తిరిగి చెడే చేస్తారు కదా, దుష్టుడికి సహాయం చేయడం చివరికి హానికే దారితీస్తుంది.

 పాములు కలలోకి వస్తున్నాయా, సర్పదోషం వెంటాడుతోందా...ఆగష్టు 08 నాగుల చవితి రోజు ఇలా చేయండి!

పాములు పాలను జీర్ణం చేసుకోలేకపోవడానికి గల శాస్త్రీయ కారణం

శాస్త్రం ప్రకారం, పాములు శరీసృపాలు, క్షీరదాలు కావు. వాటి శరీరాలు లాక్టోజ్‌ను జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్‌లను లేదా జీర్ణరసాలను ఉత్పత్తి చేయవు. పాములు 100% మాంసాహారులు, కేవలం ఎలుకలు, కప్పలు,  కీటకాలను మాత్రమే తింటాయి. వాటి జీర్ణవ్యవస్థ ఘన, మాంసాహారాన్ని జీర్ణం చేసుకునేలా రూపొందించలేదు. పాము కడుపులోకి పాలు ప్రవేశించినప్పుడు, అది తీవ్రమైన అజీర్ణం, ఇన్ఫెక్షన్, కడుపు ఉబ్బరం  వంటి ప్రాణాంతక అనారోగ్యాలతో బాధపడి, చివరికి తీవ్రమైన బాధతో మరణిస్తుంది.

 తెలిసో తెలియకో పాముల్ని చంపేస్తే ఏం జరుగుతుంది - ఏం చేస్తే ఆ పాపం పోతుంది!

పాములు పాలు తాగుతాయనే ప్రచారం ఎలా వ్యాపించింది?
 
ఈ మూఢనమ్మకానికి ప్రధానంగా పాములు పట్టేవారి క్రూరత్వం , జానపద కథలే కారణం. నాగ పంచమికి కొన్ని వారాల ముందు, పాములు పట్టేవారు అడవి నుంచి పాములను పట్టుకుని, వాటిని చీకటి పెట్టెలలో బంధించి, ఆకలితో అలమటించేలా చేస్తారు. తీవ్రమైన దాహంతో ఉన్న పాము ముందు ఒక గిన్నెలో పాలు ఉంచినప్పుడు, అది బ్రతకడం కోసం నీళ్ళని పొరబడి ఏ ద్రవాన్నైనా తాగుతుంది. అంతేకాకుండా, ధామిన్ సర్పం ఆవు పాలు తాగుతుందని గ్రామీణ ప్రాంతాల్లో పుకార్లు వ్యాపించాయి, కానీ నిజం ఏంటంటే అది కేవలం ఎలుకలను వేటాడటానికి మాత్రమే గోశాలలకు వస్తుంది. 

గమనిక: పండితులు సూచించిన విషయాలు, ఆధ్యాత్మిగ గ్రంధాల్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. పైన సూచించిన నియమాలు అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా మీ భక్తివిశ్వాసాలు, వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడిఉంటుంది..

పాపం చేసిన వెంటనే దేవుడు శిక్ష వేసేయొచ్చు కదా..వచ్చే జన్మవరకూ ఎందుకు ఆగాలి!

Frequently Asked Questions

పాములు పాలను ఎందుకు జీర్ణం చేసుకోలేవు?

పాములు సరీసృపాలు, క్షీరదాలు కావు. వాటి శరీరంలో లాక్టోజ్‌ను జీర్ణం చేసే ఎంజైమ్‌లు ఉండవు. పాలు తాగితే అజీర్ణం, ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాణాపాయం కలుగుతుంది.

పాములు సాధారణంగా ఏమి తింటాయి?

పాములు 100% మాంసాహారులు. అవి ఎలుకలు, కప్పలు మరియు కీటకాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. వాటి జీర్ణవ్యవస్థ మాంసాహారాన్ని జీర్ణం చేసుకునేలా రూపొందించబడింది.

పాములు పాలు తాగుతాయనే నమ్మకం ఎలా వ్యాపించింది?

పాములు పట్టేవారి క్రూరత్వం, జానపద కథల వల్ల ఇది వ్యాపించింది. పాములను బంధించి, దాహంతో ఉంచినప్పుడు, అవి నీటిని పొరబడి పాలు తాగుతాయి.

'పాము పాలు తాగినా విషమే కక్కుతుంది' అనే నానుడి అర్థం ఏమిటి?

దుష్ట స్వభావం గల వ్యక్తికి సహాయం చేసినా, వారికి మేలు చేసినా వారి స్వభావం మారదని దీని అర్థం. చివరికి వారు హానికే దారితీస్తారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
Solar Eclipse 2026: మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
Solar Eclipse 2026: సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
ఆగష్టు 12న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget