ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, 2024లో 2.06 కోట్ల క్యాన్సర్ కేసులు ఉండగా, 2050 నాటికి ఇది 3.5 కోట్లకు చేరుకుంటుంది. అంటే కేవలం 25 ఏళ్లలో 66.7 శాతం పెరుగుదల ఉంటుందని ఐఏఆర్సీ హెచ్చరిస్తోంది.
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్!
Global Cancer Report:గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ క్యాన్సర్ 2026 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ హెచ్చిరిస్తోంది.

- 2050 నాటికి 3.5 కోట్ల క్యాన్సర్ కేసులు పెరుగుతాయని WHO హెచ్చరించింది.
- ప్రతి ఇంట్లో క్యాన్సర్ రోగి; రోజుకు 26,000 మంది మృతులు.
- భారతదేశంలో క్యాన్సర్ కేసులు రెట్టింపు; పొగాకు, జీవనశైలి కారకాలు.
WHO Global Cancer Report 2026:ప్రపంచంలో మానవాళిని కబలిస్తున్న అతి భయంకరమైన మహమ్మారిలో మొదటిది గుండెజబ్బులు అయితే, రెండో స్థానంలో క్యాన్సర్ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఎవరికో ఒకరికి వస్తుందులే మనకు రాదనే ధీమా చాలా మందిలో ఉంటుంది. కానీ అలాంటి వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ షాక్ ఇస్తోంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్‌తో కలిసి విడుదల చేసిన ఒక రిపోర్ట్ అందర్నీ భయపెడుతోంది. వచ్చే కాలంలో ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ రోగి ఉంటాడని ఐదుగురిలో ఒకరిని ఈ క్యాన్సర్ పిశాచి కబళిస్తుందని , తప్పించుకోవడం ఈజీ కాదని చెబుతోంది. ఈ రిపోర్ట్ చేసిన వారంతా షాక్ అవుతున్నారు.
మన మధ్యలోనే ఉన్న వారిలో 92శాతం మంది జీవితంలో ఏదో దశలో క్యాన్సర్ బారిన పడతారని ది ఫ్యూచర్ వి చూజ్ టుగెదర్ అనే టైటిల్‌తో వచ్చిన గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ క్యాన్సర్ 2026 రిపోర్టులో స్పష్టంగా చెప్పింది. రోజుకు సరాసరి 26వేల మంది ఈ క్యాన్సర్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతారని హెచ్చరిస్తోంది. 2050 నాటికి క్యాన్సర్ కేసులు ఇంతలా పెరగడానికి కారణాలు ఏంటీ? భారత్‌లో పరిస్థితి ఎలా ఉండబోతోందో చూద్దాం.
66.7శాతం పెరగనున్న క్యాన్సర్ కేసులు
ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం 2024నాటికి ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 2.06 కోట్ల క్యాన్సర్ కేసులు వెలుగు చూశాయి. ఇదే స్పీడ్‌తో రోగం వ్యాప్తి చెందితే 2050 నాటికి ఈ సంఖ్య 3.5 కోట్లకు చేరుతుందని IARC మ్యాథ్‌మెటికల్ ప్రొజెక్షన్ హెచ్చరిస్తోంది. కేవలం పాతికేళ్లలోనే క్యాన్సర్ కేసులు ఏకంగా 66.7 శాతం పెరగబోతున్నాయి. మరణాల విషయానికి వస్తే 2024లో 97 లక్షల మంది చనిపోయారు. ఇది ప్రపంచ మరణాల రేటులో 16.5శాతం. ఇందులో 48 లక్షల మరణాలు 30 నుంచి 69 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారివే. అంటే ప్రొడెక్టివ్ ఏజ్, మధ్య వయస్కులు ఈ రోగం బారిన పడుతున్నారు.
పురుషులు, మహిళల్లో ఎవరికి ముప్పు పొంచి ఉంది?
గ్లోబల్ లెవెల్‌లో క్యాన్సర్ ప్రొఫైల్ చాలా వేగంగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్యం సంస్థ నివేదిక ప్రకారం ప్రతి 11 మంది పురుషుల్లో ఒకరు, ప్రతి 13 మంది స్త్రీలలో ఒకరు 75 ఏళ్ల కంటే ముందే క్యాన్సర్ వల్ల చనిపోయే ప్రమాదం ఉంది. భారత్ సహా అన్ని దేశాల్లో లంగ్ క్యాన్సర్ టాప్ ప్లేస్‌లో ఉంది. దీని తర్వాత నోటి క్యాన్సర్, పేగు క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ పీడిస్తోంది. మహిళలను బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వేధిస్తోంది. తర్వాత స్థానం సెర్వికల్ క్యాన్సర్, రెండో స్థానంలో ఉంది.
భారత్‌లో కేసులు డబుల్
టాటా మెమోరియల్ సెంటర్ వంటి ప్రముఖ సంస్థలు భారత్‌లో చేసిన సర్వే ప్రకారం ఏటా 14 నుంచి 15 లక్షల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దాదాపు 11.6 లక్షల మంది చనిపోతున్నారు. వృద్ధాప్య జనాభా పెరుగుదల, ఎయిర్ పొల్యూషన్, జీవనశైలి మార్పుల వల్ల 20250 నాటికి భారత్‌లో క్యాన్సర్ రోగుల సంఖ్య 21 లక్షలకుపైగా ఉంటుంది. ఇప్పుడున్‌న దాటి కంటే రెట్టింపు కానుంది.
క్యాన్సర్ కారకాలు ఏంటీ?
ప్రపంచ ఆరోగ్యం సంస్థ ఐఏఆర్సీ డైరెక్టర్ డాక్టర్ ఎలిజబెత్ వీడర్ పాస్ ప్రకారం క్యాన్సర్ కేసుల్లో దాదాపు 40 శాతం పూర్తిగా నివారించదగ్గవే. రోజువారీ అలవాట్లలో ఉండే నాలుగు ప్రధాన అంశాలే క్యాన్సర్ కణాలను యాక్టివేట్ చేస్తున్నాయి. క్యాన్సర్‌కు అతి పెద్ద డ్రైవర్ పొగాకు. పురుషుల్లో 50 శాతం మందికి దీని బాధితులే. దీంతోపాటు గుట్కా, ఖైనీ వంటివి నమలడం ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. గర్భాశయ క్యాన్సర్‌కు హ్యూమన్ పాపిల్లోమావైరస్, హెపటైటిస్ బి, సి, హెలికోబాక్టర్ పైలోరీ, వంటి ఇన్‌ఫెక్షన్లు వల్ల క్యాన్సర్ విస్తరిస్తోంది. మితిమీరిన ఆల్కాహాల్ అలవాటు కూడా కాలేయం, జీర్ణవ్యవస్థ క్యాన్సర్‌లకు ప్రత్యక్ష కారణం అవుతుంది. ఊబకాయం, జంక్‌ఫుడ్ సంస్కృతి వల్ల బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి క్యాన్సర్ ముప్పును రెట్టింపు చేస్తోంది.
Frequently Asked Questions
క్యాన్సర్ కేసులు భవిష్యత్తులో ఎంత పెరుగుతాయని అంచనా?
క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు ఏమిటి?
పొగాకు, గుట్కా, ఖైనీ, ఆల్కహాల్, ఊబకాయం, జంక్ ఫుడ్ వంటివి క్యాన్సర్‌కు ప్రధాన కారకాలు. హ్యూమన్ పాపిల్లోమావైరస్, హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్లు కూడా క్యాన్సర్ విస్తరణకు కారణమవుతాయి.
భారతదేశంలో క్యాన్సర్ పరిస్థితి ఎలా ఉంది?
భారతదేశంలో ఏటా 14-15 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వృద్ధాప్య జనాభా పెరుగుదల, వాయు కాలుష్యం, జీవనశైలి మార్పుల వల్ల 2050 నాటికి ఈ సంఖ్య 21 లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉంది.
పురుషులు మరియు మహిళలలో ఎక్కువగా కనిపించే క్యాన్సర్‌లు ఏవి?
పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, పేగు క్యాన్సర్ ప్రబలంగా ఉన్నాయి. మహిళలలో బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా వేధిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు






















