By: ABP Desam | Updated at : 15 Feb 2022 08:14 PM (IST)
Image Credit: Sidharth.M.P/Twitter
చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారి పరిసర ప్రాంతాల్లో చిన్ని చిన్ని వస్తువులు ఏవీ కనిపించకూడదు. వాటిని తినే వస్తువులు అనుకుని నోట్లో పెట్టేసుకుంటారు. చెన్నైకు చెందిన ఓ నాలుగేళ్ల ఇలాంటి ప్రమాదంలోనే చిక్కుకున్నాడు. రిమోట్‌తో ఆటలాడుతూ.. 5 సెంటీమీటర్ల పొడవున్న బ్యాటరీని తీసి నోట్లో పెట్టుకున్నాడు. అది అనుకోకుండా కడుపులోకి జారుకుంది. దీంతో పిల్లాడు ఏడ్వడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అక్కడ ఉన్న అతడి తల్లిదండ్రులకు అనుమానం కలిగి వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు కాబట్టి సరిపోయింది. ఆ విషయం వారికి తెలిసి ఉండకపోతే.. బ్యాటరీలోని రసాయనాలు ఆ పిల్లాడి కడుపులోకి చేరేవి.
బాలుడికి ఎక్స్‌రే చేసిన వైద్యులు.. కడుపులో బ్యాటరీని కనుగొన్నారు. అయితే, దాన్ని సర్జరీతో మాత్రమే తొలగించాలని తొలుత భావించారు. అయితే, దాని వల్ల పిల్లాడు ఇబ్బంది పడతాడని భావించిన వైద్యులు.. ఎండోస్కోపీ విధానంలో బ్యాటరీని బయటకు తీయాలని నిర్ణయించుకున్నారు. అయితే, దాని వల్ల అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వెనుకడుగు వేశారు. ఆలస్యం చేస్తే ప్రాణాలకు మరింత ప్రమాదమని భావించిన వైద్యులు చివరికి ఎండోస్కోపీ ద్వారానే బ్యాటరీ బయటకు తీయాలని నిర్ణయించుకున్నారు.
వైద్యులు ఆ బాలుడి నోటి నుంచి నెమ్మదిగా పైపును పంపి.. కడుపులో ఉన్న బ్యాటరీ వరకు చేరుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఎంతో జాగ్రత్తగా, అతడి అంతర్గత అవయవాలకు గాయాలు కాకుండా బయటకు తెచ్చారు. ఇందుకు సుమారు 14 గంటలు శ్రమించారు. బ్యాటరీలోని రసాయానాలు లీకయ్యే లోపే.. దాన్ని బయటకు తీసేసి పసివాడి ప్రాణాలు కాపాడారు.
ఈ చికిత్సను రేలా హాస్పిటల్‌లో నిర్వహించారు. సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఆర్.రవి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దాదాపు 14 గంటలు శ్రమించి ఎంతో జాగ్రత్తగా ఆ బ్యాటరీని బయటకు తీశాం. పిల్లలు మనకు తెలియకుండానే బటన్లు, నాణేలు, బ్యాటరీలు తదితర చిన్న చిన్న వస్తువులను మింగేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాటిని మలంతోపాటు బయటకు రావు. కడుపులోనే ఉండిపోతాయి. కడుపు నుంచి కొన్ని యాసిడ్లు విడుదలవుతాయి. దాని వల్ల బ్యాటరీ తుప్పు పడుతుంది. ఆ తర్వాత అందులోని రసాయనాలను కడుపులోకి వదులుతుంది. అది విషపూరితమై ప్రాణాలకు ప్రమాదకరం కావచ్చు’’ అని తెలిపారు.
#Chennai - without surgery, doctors save 4yr old who ingested 5cm-long AA battery, which ws nearly the size of his food pipe
— Sidharth.M.P (@sdhrthmp) February 14, 2022
Batt was lodged in stomach, had risk of corroding in contact with acid
Rela hospital Docs performed endoscopy with a 'Roth net' & removed foreign object pic.twitter.com/jmsnfXwUgH
Also Read: విమానంలో స్నేక్ బాబు ఫ్రీ జర్నీ, ఆ పాము ఎలా దూరిందబ్బా?
Also Read: ముప్ఫై ఏళ్ల క్రితం మునిగిన గ్రామం తొలిసారి బయటపడింది, వీడియో చూడండి
High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది
Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా
Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే
Dengue Diet: డెంగ్యూ జ్వరం వస్తే తినాల్సినవి ఇవే, వీటితో సమర్థంగా ఎదుర్కోవచ్చు
Sweat in Sleep: నిద్రలో చెమట పట్టడం ఆ వ్యాధులకు సంకేతం? డాక్టర్‌ను సంప్రదించాల్సిందే!
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?
YSRCP Politics : సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !
Gyanvapi Mosque Survey Report: జ్ఞానవాపి మసీదులో ఆలయ అవశేషాల గుర్తింపు- వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు!