News
News
X

Blood Diamonds: ఆ దేశంలో వజ్రాలు విరివిగా దొరకుతాయి! అయినా, నిత్యం ఆకలి చావులు, అనుక్షణం భయం భయం!!

అక్కడ అపార సంపద ఉంది. ఆ సంపద కోసం జనాలు నిత్యం వేటలో ఉంటారు. కానీ, వారి బతుకు చిత్రం అత్యంత దయనీయంగా ఉంటుంది. ఆకలి చావులతో నిత్యం మార్మోగుతుంది.

FOLLOW US: 
 

డైమండ్.. ఈ పేరు వినగానే మగువల మెడలో అందంగా హొయలుపోతూ కనిపించే సుందర దృశ్యాలు మన కళ్ల ముందు కనిపిస్తాయి. కానీ, వాటి సేకరణ వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఎంతో మంది వజ్రాలను వెతుకుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.  ఇప్పటికీ చాలా మంది కోల్పోతూనే ఉన్నారు. భూగర్భంలో ఉండే తీవ్ర ఉష్ణోగ్రతల దగ్గర కార్బన్ అణువులు ఘనీవించి వజ్రాలుగా రూపొందుతాయి. అందుకే, వీటికి అత్యంత కాఠిన్యత ఉంటుంది. వాస్తవానికి ప్రపంచంలోని ప్రపంచ ప్రసిద్ధ వజ్రాలన్నీ భారత్ కు చెందినవే. కానీ, 1867 అనంతరం ఆఫిక్రన్ దేశాలు వజ్రాల ఉత్పత్తిలో ముందజలో నిలిచాయి.  దక్షిణాఫ్రికా, బోత్స్వానా, నమీబియా, కెనాడా సైతం డైమండ్స్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధించాయి.   

ప్రపంచంలో ఇతర దేశాల గురించి కాసేపు పక్కన పెడితే, సౌత్ ఆఫ్రిగా పరిస్థితి చాలా విషాదకరంగా ఉంటుంది. అక్కడి భూమి అద్భుత నిక్షేపాలతో నిండి ఉంటుంది. బంగారం, ప్లాటినం, డైమండ్స్ విరివిగా దొరుకుతాయి. విలువైన ఖనిజ సంపద ఉన్నా ఆదేశం ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. ఆకలితో అలమటిస్తూ నిత్యం ఎంతో మంది చనిపోతుంటారు. ఆదేశంలో వజ్రాల కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్న ఊరిని కన్న వారినీ వదిలి ఎంతో మంది ఇతర ప్రాంతాలు వలస పోయారు. వేల మంది ఆడవాళ్లు అత్యాచారాలకు గురయ్యారు. లక్షల మంది మగవారు ఊచకోతకు బలయ్యారు. అసలు వజ్రాలకు ఈ దారుణాలకు కారణం ఏంటి? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కాస్త కాలాన్ని వెనక్కి తిప్పాలి. వజ్రాల వెనుక దాగి ఉన్న రక్తపుటేరులు జాలువారుతూ కనిపిస్తాయి.   

News Reels

దక్షిణాఫ్రికాలోని సంపదపై అగ్రదేశాలు కన్నువేశాయి. వలస పాలనకు పునాదులు పడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వజ్రాల పోరాటం మొదలయ్యింది. బ్రిటన్  సైన్యంలో పని చేస్తున్న సియెర్రా లియోన్‌ వాసులు తమ దేశానికి తిరిగి వచ్చాక వజ్రాల వేట మొదలయ్యింది.  సియోర్రా భూమిలో వజ్రాలు విరివిగా దొరుకుతాయి.  యుద్ధం నుంచి వచ్చిన స్థానికులు 5, 6వ దశకాలలో అక్రమ మైనింగ్‌ మొదలు పెట్టారు. దొరికిన వజ్రాలను స్థానిక మార్కెట్లలో అమ్మడం మొదలు పెట్టారు. అవి బహిరంగ ప్రాంతాలు కావడంతో మైన్స్ భద్రత కష్టం అయ్యింది. స్థానికులు వజ్రాల వేటలో పాల్గొనకుండా బ్రిటిష్‌ పాలకులు పోలీసులను నియమించారు. కానీ, ఏమాత్రం ఆపలేకపోయారు. అక్రమ మైనింగ్‌ బాగా విస్తరించింది.  సియెర్రా లియోన్‌కు కావలసిన మార్కెట్‌ను లెబనాన్‌ అందించింది.  

ఈ వజ్రాలు లైబీరియాకు తరలి వెళ్లడం మొదలు పెట్టాయి బాటపట్టాయి.  వజ్రాల  మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో ఊపందుకుంది.  అదే సమయంలో ఆధిపత్యం కోసం డి బీర్స్‌ సంస్థ ముందడులు వేసింది.   అంగోలా, సియెర్రా లియెన్‌ సహా పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి ఆ సంస్థ వజ్రాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసింది.    డైమెండ్‌ ఈజ్‌ ఫర్‌ ఎవర్‌ అనే నినాదాన్నిజనాల్లోకి తీసుకొచ్చింది. ఆఫ్రికాలో వజ్రాల డిమాండ్‌ భారీగా పెరిగింది.  వజ్రాల మైనింగ్‌ కోసం పలు దేశాలు ఘోరాలకు పాల్పడ్డం మొదలు పెట్టాయి. వజ్రాలు అధికంగా ఉన్న ప్రాంతాలకు స్థానికులను రాకుండా వెళ్లగొట్టారు. చాలా మందిని ఊచకోత కోశారు.  వజ్రాలను ఏరేందుకు  మహిళలు, చిన్న ప్లిలలతో బానిసత్వం చేయించారు.  వజ్రాల గనులపై ఆధిపత్యం కోసం   తిరుగుబాట్లు, ప్రచ్ఛన్న యుద్ధాలు మొదలయ్యాయి. సియెర్రా లియోన్‌లో  రెవల్యూషనరీ యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రజలను కిరాతకంగా చంపేసింది. ఊళ్లకు ఊళ్లను ఖాళీ చేయించింది. ఈ దాడుల్లో ఎంతో మంది అమాయకులు చనిపోయారు. మరెంతో మంది అక్కడి నుంచి పారిపోయారు సియెర్రా లియోన్‌ మాత్రమే కాదు.  పశ్చిమ, మధ్య ఆఫ్రికా వజ్రాల మైనింగ్‌ లో  రక్తసిక్తమైంది.. అవినీతితో కూరుకుపోయిన ఆఫ్రికా దేశాల అసమర్థ మరింత దిగజార్చింది.  అంగోలా డైమండ్‌ మైనింగ్‌లో పనిచేసే కార్మికులు ఇప్పటకీ దోపిడీకి గురువుతున్నారు. బానిసల్లా బతుకుతున్నారు.  

కాంగోలోనూ దాదాపు ఇదే పరిస్థితులున్నాయి. ప్రపంచంలోని మొత్తం వజ్రాల్లో 26 శాతం అక్కడే దొరుకుతాయి . కానీ అది ప్రపంచంలోకెల్లా అత్యంత నిరుపేద దేశాల్లో ఒకటి.  1998 నుంచి కాంగోలో వజ్రాల కోసం జరిగిన యుద్ధం వల్ల 17 లక్షల మంది చనిపోయారు. ఎంతో మంది మహిళలు, పిల్లలు లైంగిక దాడులకు గురయ్యారు. చివరకు వేల సంఖ్యలో జనాలు ఆకలికి బలయ్యారు. ఇప్పటికీ అక్కడ వజ్రాల కోసం నిత్యం రక్తపాతం జరుగుతూనే ఉంది.   

Published at : 02 Oct 2022 02:03 PM (IST) Tags: African countries Blood Diamonds Conflict Diamonds Blood Diamonds Facts

సంబంధిత కథనాలు

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

Curry Leaves: కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తున్నారా? ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతునట్టే!

Curry Leaves: కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తున్నారా? ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతునట్టే!

Diabetes: శీతాకాలంలో మధుమేహ రోగులు కచ్చితంగా తినాల్సిన కూరగాయలు ఇవే

Diabetes: శీతాకాలంలో మధుమేహ రోగులు  కచ్చితంగా తినాల్సిన కూరగాయలు ఇవే

టాప్ స్టోరీస్

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!