అన్వేషించండి

Diwali 2025 Rangoli Designs : దీపావళి స్పెషల్ ఫ్లవర్ రంగోలి డిజైన్స్.. 2025 సెలబ్రేషన్స్​కి ఈ ముగ్గులు బెస్ట్

Diwali 2025 Rangolis : దీపావళి 2025 కోసం అందమైన రంగోలి డిజైన్లు వేయాలనుకుంటున్నారా? అయితే పండుగ శోభను పెంచే అందమైన ముగ్గుల ఫోటోలతో సహా ఇక్కడున్నాయి. ట్రై చేసేయండి.

Easy Diwali Rangoli with Flowers For Deepavali 2025 : దీపావళి సమయంలో అత్యంత ప్రధానమైన పనుల్లో తప్పకుండా చేయాల్సింది ఏదైనా ఉందా అంటే అది రంగోళి(Diwali is incomplete without Colorful Rangoli) వేయడమే. అవును ఇంటి ముందు చక్కని ముగ్గు వేసి.. దానిని పువ్వులతో నచ్చిన రంగులతో అలంకరించి.. దానిపై దీపాలు పెడితే చాలు. మొత్తం పండుగ ఇంటి ముందు ఉన్నట్లు అనిపిస్తుంది. రంగోళిని కేవలం అలంకరణ కోసమే కాదు.. శ్రేయస్సు, ఆనందం కోసంతో పాటు అందరికీ స్వాగతం చెప్పడాన్ని సూచిస్తాయి. అయితే ఈ దీపావళి 2025 (Diwali 2025 Rangoli Designs) కోసం మీరు ఎలాంటి ముగ్గులు వేయాలని ఆలోచిస్తున్నారా? అయితే అందమైన పువ్వుల రంగోలి డిజైన్‌(Flower Rangoli Ideas)లు ఎలా వేయవచ్చో.. వాటిని ఎలా అలంకరిస్తే లుక్ బాగుంటుందో ఇప్పుడు చూసేద్దాం. 

క్లాసిక్ రంగోలి.. పువ్వులతో

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

దాదాపు అందరూ ఈజీగా వేయగలిగే రంగోళిలలో ఇది ఒకటి. దీనిని మీరు ఇంటి ముందు, హాల్​లో, బాల్కనీలో వేసుకునేందుకు అనువైనది. చాలా సులభంగా, ఆకర్షణీయంగా వేయగలిగే ముగ్గు ఇది. దీనికోసం మీరు బంతి పువ్వు, గులాబీ, చామంతి రేకులను ఉపయోగించవచ్చు. సర్కిల్ డిజైన్ వేసుకుని.. మధ్యలో నుంచి పూరేకులతో ఫిల్లింగ్స్ చేసుకుంటూ.. బయటి వరకు వచ్చేయవచ్చు. దీనిని ప్రధాన ద్వారాలు లేదా పూజా గదుల వద్ద కూడా వేసుకోవచ్చు. దీపావళి సాయంత్రం ప్రకాశవంతమైన లుక్ తీసుకురావడానికి దీనిని వేయవచ్చు. అలాగే ఈ ముగ్గును చిన్న దివ్వెలతో అలంకరిస్తే లుక్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ డిజైన్ మొత్తం పండుగ వాతావరణాన్ని పెంచుతుంది.

నెమలి-రంగోలి

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

భారతదేశ జాతీయ పక్షి నుంచి నుంచి ప్రేరణ పొందుతూ.. ఈ పండక్కి నెమలిని రంగోలిగా వేయవచ్చు. దానిని పువ్వులు, ఆకులతో అలంకరిస్తే ఇంకేమైనా ఉందా.. పండుగ శోభ డబుల్ అయిపోద్ది. అయితే ఈకల కోసం ఆకులు, నీలిరంగు పువ్వులు ఉపయోగించవచ్చు. శరీరం కోసం ఆకుపచ్చ బంతి పువ్వులు, దానిరంగుకు సరిపోలే పువ్వులు, ఆకులు ఎంచుకుంటే నెమలి అందంగా కనిపిస్తుంది. ముందుగా నెమలిని డ్రా చేసి.. లేదా ముగ్గుతో వేసి.. దానిని పువ్వులు, ఆకులతో నింపాలి. అప్పుడే రంగోలి కరెక్ట్​గా వస్తుంది. అలాగే ఈకల దగ్గర దీపాలు పెట్టండి. మీ ముగ్గు సెంట్రాఫ్ అట్రాక్షన్​గా మారుతుంది.

తామర రంగోలి డిజైన్

(Image Source: ABPLIVE AI)

(Image Source: ABPLIVE AI)

లోటస్ స్వచ్ఛత, శ్రేయస్సుని సూచిస్తుంది. కాబట్టి దీపావళి డిజైన్స్ వేయాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. దీనిని కూడా తేలికగా వేయవచ్చు. ఈ తామర పువ్వు రంగోళి కోసం మీరు గులాబీ, పసుపు, తెల్లని పూలు ఎంచుకుంటే మంచిది. మల్టీపుల్ కలర్స్ ఫ్లవర్స్​తో మీరు లోటస్​ను క్రియేట్ చేయవచ్చు. దీనిని పూజా ప్రాంతానికి దగ్గర్లో వేసుకోవచ్చు. ఎందుకంటే.. ఇది మీకు ఆధ్యాత్మిక లుక్ ఇస్తుంది. పువ్వు మధ్యలో దీపం పెట్టి.. చివర్లో కూడా క్యాండిల్స్ లేదా దీపాలు పెడితే చూసేందుకు రెండు కన్నులు సరిపోవు. 

దీపపు రంగోలి

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

పువ్వులు, లైట్లను మిక్స్ చేస్తూ.. దీపం ఆకారంలో వేసిన రంగోలి.. దీపావళికి పర్​ఫెక్ట్ రంగోలి అనిపించుకుంటుంది. బంతి పువ్వు రేకులతో దీపం ఆకారంలో ఈ డిజైన్ వేయండి. లోపలి భాగాలను ఎరుపు గులాబీలు లేదా ఇతర అందమైన పూరేకులతో నింపండి. మెరిసే లుక్ కోసం.. రంగోళ అంచుల వెంబడి చిన్న దీపాలను వెలిగించండి. ముగ్గుపై గ్లిట్టర్ లుక్​కోసం.. రంగులు కూడా వేయవచ్చు. ఇది మరింత రియలిస్టిక్ లుక్ ఇస్తుంది. 

ఇవేకాకుండా మీరు మండలా ఫ్లవర్ రంగోలి వేయవచ్చు. దీనికోసం ఎక్కువరంగుల పువ్వులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఎన్ని ఎక్కువ కలర్స్ ఉంటే ముగ్గు అంత అందంగా మారుతుంది. అయితే దీనిని వేసేందుకు ఓపిక, క్రియేటివిటీ చాలా అవసరం. కానీ దీపావళి వేడుకల్లో ఇదే హైలెట్​గా కూడా ఉంటుంది. లేదంటే మీరు మీకు వచ్చిన చుక్కల ముగ్గులు వేసి.. వాటి రంగులు, పువ్వులతో నింపి.. అందంగా దీపాలు పెడితే చాలు పండుగ శోభ ఇట్టే వచ్చేస్తుంది. మరి ఈ దీపావళికి మీరు కూడా ఈ తరహా ముగ్గులు వేసి.. మీ ఇంటిని హైలెట్​గా మార్చేయండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bloating and Indigestion : తరచూ కడుపు నొప్పి వస్తోందా? ఉబ్బరం, అజీర్ణం సమస్యలను దూరం చేసే ఇంటి చిట్కాలు
తరచూ కడుపు నొప్పి వస్తోందా? ఉబ్బరం, అజీర్ణం సమస్యలను దూరం చేసే ఇంటి చిట్కాలు
Jaggery In Winter: చలి కాలంలో బెల్లం ఇలా తీసుకోండి, వీటితో కలిపి తింటే ఆరోగ్యానికి మేలు
చలి కాలంలో బెల్లం ఇలా తీసుకోండి, వీటితో కలిపి తింటే ఆరోగ్యానికి మేలు
Retinol Eye Cream : రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
Sperm Quality : పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: యాచించి కాదు, శాసించి సాధించాం.. ఢిల్లీ మెడలు వంచిన నేత కేసీఆర్: అలుగునూరు సభలో కేటీఆర్
యాచించి కాదు, శాసించి సాధించాం.. ఢిల్లీ మెడలు వంచిన నేత కేసీఆర్: అలుగునూరు సభలో కేటీఆర్
Rayapati Sambasiva Rao Passes Away: మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ప్రముఖులు సంతాపం
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ప్రముఖులు సంతాపం
Amanchi Krishna Mohan: వేటపాలెంలో దొంగ ఓట్ల వివాదం.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై దాడి, గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
వేటపాలెంలో దొంగ ఓట్ల వివాదం.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై దాడి, గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
PM Modi Tirupati Tour: ప్రధాని మోదీ 3 రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు.. అమిత్ షా, అజిత్ దోవల్ సైతం
ప్రధాని మోదీ 3 రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు.. అమిత్ షా, అజిత్ దోవల్ సైతం
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
KTR: తుఫాను తీరం తాకినట్లు, కరీంనగర్ నుంచి కేసీఆర్ భూకంపం పుట్టించిన రోజు: దీక్షా దివస్‌లో కేటీఆర్
తుఫాను తీరం తాకినట్లు, కరీంనగర్ నుంచి కేసీఆర్ భూకంపం పుట్టించిన రోజు: దీక్షా దివస్‌లో కేటీఆర్
Kannamma OTT : ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget