Blood Sugar : రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచే టాప్ 5 పండ్లు ఇవే.. జాగ్రత్తగా తినండి
Fruits Can Raise Blood Sugar Levels : డయాబెటిస్ ఉన్నవారు కొన్ని పండ్లు ఎక్కువగా తినొద్దని చెప్తున్నారు. ఇంతకీ ఆ పండ్లు ఏంటి? వాటిని తీసుకుంటే షుగర్ ఎందుకు పెరుగుతుందో చూసేద్దాం.

- షుగర్ లెవెల్స్ పెంచే కొన్ని పండ్లను మధుమేహులు జాగ్రత్తగా తినాలి.
- అరటి, ద్రాక్ష, పైనాపిల్, పుచ్చకాయ, మామిడిలో షుగర్ ఎక్కువగా ఉంటుంది.
- ఈ పండ్లను పండ్ల రూపంలోనే, తక్కువ మోతాదులో తీసుకోవాలి.
- ప్రోటీన్, ఫైబర్ ఆహారంతో కలిపి తింటే షుగర్ స్పైక్ తగ్గుతుంది.
Fruits Can Spike Your Blood Sugar Instantly : పండ్లు ఆరోగ్యానికి మంచివే. కానీ డయాబెటిస్ ఉన్నవారు లేదా బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవాలనుకునేవారు.. కొన్ని పండ్లకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్ని పండ్లు తింటే వెంటనే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని.. ఇది మధుమేహులకు, ప్రీ డయాబెటిక్ ఉన్నవారికి ఇబ్బందిని కలిగిస్తాయి. లిమిటెడ్‌గా తీసుకుంటే పర్లేదు కానీ.. ఎక్కువగా తింటే రక్తంలో షుగర్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఏ పండ్లు తినేప్పుడు జాగ్రత్తగా ఉండాలో.. వాటిని తింటే రక్తంలో షుగర్స్ ఎందుకు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటిపండ్లు
అరటిపండ్లు ఆరోగ్యానికి, ఎనర్జీకి మంచి సోర్స్ అయినా.. పండిన అరటిపండ్లలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉండటంతో బ్లడ్ షుగర్ త్వరగా పెరుగుతుంది. కాబట్టి మధుమేహులు అరటిపండ్లకు దూరంగా ఉంటే మంచిది.
ద్రాక్ష
ద్రాక్ష పండ్లు చిన్నగా ఉంటాయి. తినేందుకు అనువుగా, తియ్యగా ఉంటాయి. కాబ్టటి వీటిని ఎక్కువగా తింటారు. కానీ వీటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. ఒక్కసారిగా ఎక్కువ తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
పైనాపిల్
పైనాపిల్ టేస్టీగా ఉండే పండ్లలో ఒకటి. పైగా ఇది ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచుతుంది. కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే తిన్న వెంటనే గ్లూకోజ్ లెవల్స్ పెంచే అవకాశం ఉంది.
పుచ్చకాయ
వేసవిలో పుచ్చకాయ చాలామంది ఎక్కువగా తింటారు. దాదాపు 92 శాతం నీరు పుచ్చకాయలో ఉంటుంది. నీరు ఎక్కువగా ఉన్నప్పటికీ GI ఎక్కువగా ఉంటుంది. దీనిని ఎక్కువ పరిమాణంలో తింటే షుగర్ పెరుగుతుంది.
మామిడి పండ్లు..
మామిడి పండ్లు చాలామందికి ఫేవరెట్ ఫ్రూట్. అయితే వీటిలో సహజమైన షుగర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ స్పైక్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు మామిడి పండ్లు ఇష్టం ఉంటే.. తక్కువ మోతాదులో వాటిని డైట్లో తీసుకోవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఈ ఫ్రూట్స్ రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచినా.. వాటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ పరిమితంగా తీసుకోవచ్చు. అలాగే వీటిని జ్యూస్‌గా కాకుండా పండ్ల రూపంలోనే పూర్తిగా తినాలి. ప్రోటీన్, ఫైబర్ ఫుడ్స్‌తో కలిసి తింటే షుగర్ స్పైక్ తగ్గుతుంది. అలాగే అన్ని ఫ్రూట్స్ ఒకేసారి తీసుకోకూడదు.
పండ్లు ఆరోగ్యానికి అవసరమే. కానీ సరైన ఎంపికతో పాటు తీసుకునే సరైన పరిమాణం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ పండ్లను పూర్తిగా మానేయకుండా.. జాగ్రత్తగా, నియంత్రణలో తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















