అన్వేషించండి

Eggs for 14 Days : వరుసగా 14 రోజులు గుడ్లు తింటే శరీరంలో జరిగే మార్పులు.. నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే

Eggs for Health Benefits : 14 రోజులు గుడ్లు తింటే శరీరంలో ఏమవుతుంది? కొలెస్ట్రాల్ పెరుగుతుందా? శరీరంలో జరిగే మార్పులతో పాటు.. నిపుణులు చెప్పిన నిజాలు ఏంటో చూసేద్దాం.

Surprising Benefits of Eggs : గుడ్లు ఆరోగ్యానికి చాలామంచివి. ఆరోగ్య సమస్యల నుంచి.. చర్మం, జుట్టు విషయంలో కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. బరువు తగ్గడంలో కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అయినా సరే చాలా మంది రోజూ గుడ్లు తింటే.. ముఖ్యంగా గుడ్డలోని పచ్చసొన తింటే.. కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడతారు. కొలెస్ట్రాల్ పెరుగుతుందని వాటిని తినడం ఆపేస్తారు. కానీ తాజా అధ్యయనాలు, నిపుణులు వాటిని తోసి పుచ్చుతున్నారు. సరైన పరిమితిలో గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతున్నాయని చెప్తున్నారు.

గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పచ్చసొనలో విటమిన్ ఎ, ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని చెప్తున్నారు నిపుణులు. కాబట్టి కేవలం గుడ్డు తెల్లసొన మాత్రమే తినడం సరిపోదని.. పోషకాలున్న పచ్చసొనతో పాటు తినాలని సూచిస్తున్నారు. డాక్టర్ సేథి.. 14 రోజులు.. రోజూ గుడ్లు తింటే శరీరంలో కొన్ని మార్పులు వస్తాయని చెప్తున్నారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్.. చేసి అపోహలను క్లియర్ చేశారు. ఇంతకీ ఆయన చెప్పిన విషయాలు ఏంటి? 14 రోజులు రోజూ గుడ్డు తింటే కలిగే లాభాలు ఏంటి? ఎవరు తినకూడదు? గుడ్లు తినేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Saurabh Sethi MD MPH | Gastroenterologist (@doctor.sethi)

మెదడు పనితీరుకై..

గుడ్లలో ఉండే చోలిన్ అనే పోషక పదార్థం మెదడుకు చాలా అవసరం. ఇది అసిటైల్‌కోలిన్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్ తయారీలో సహాయపడుతుంది. దీంతో మెమరీ, ఫోకస్ మెరుగవుతాయి.

కొలెస్ట్రాల్ ప్రొఫైల్ 

చాలామంది గుడ్లు తింటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుకుంటారు. కానీ వాస్తవానికి.. గుడ్లు తినడం వల్ల శరీరంలో HDL (మంచి కొలెస్ట్రాల్) పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కంటి ఆరోగ్యం

గుడ్డు పచ్చసొనలో ల్యూటిన్, జియాజాంతిన్ ఉంటాయి. ఇవి బ్లూ లైట్ నుంచి కళ్లను రక్షిస్తాయి. కంటి చూపు ఆరోగ్యంగా ఉంచుతాయి.

చర్మం, జుట్టు సంరక్షణకై.. 

గుడ్లలో ఉన్న సల్ఫర్ అమినో యాసిడ్స్ కెరాటిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే జుట్టు, చర్మం, గోళ్లను బలంగా చేస్తాయి. 

ప్రోటీన్ కోసం.. 

గుడ్లు ప్రోటీన్​కు మంచి సోర్స్​గా చెప్తారు. ఇవి కండరాలు బిల్డ్ చేయడానికి అవసరం అవుతాయి. కండర ద్రవ్యరాశి కోల్పోకుండా చేస్తంది. 

బరువు తగ్గడానికై..

గుడ్లు తింటే ఎక్కువసేపు ఆకలి అనిపించదు. అలాగే ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది. వెయిట్ లాస్‌కు హెల్ప్ అవుతుంది. 

ఇన్‌ఫ్లమేషన్ తగ్గే అవకాశం

పచ్చసొనతో కలిసి గుడ్లు తింటే.. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల వాపు తగ్గుతాయి. హార్మోన్స్, సెల్ ఫంక్షన్‌కు మేలు చేస్తుంది. 

గుడ్లు ఎవరు తినకూడదు..

రోజుకు 1లేదా 2 గుడ్లు తినొచ్చు. కానీ ఇది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి మారుతుంది. డయాబెటిస్ ఉన్నవారు, హార్ట్ పేషెంట్స్, హై కొలెస్ట్రాల్ ఉన్నవారు డాక్టర్ సలహాతో వీటిని తీసుకోవాలి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget