అన్వేషించండి

Lemon Water in Summer : వేసవిలో రోజూ నిమ్మరసం తాగితే కలిగే లాభాలు ఇవే.. హెల్త్ బెనిఫిట్స్ & జాగ్రత్తలు

Lemon Water : సమ్మర్లో రోజూ నిమ్మరసం తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి అని నిపుణులు చెప్తున్నారు. దీనిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో.. ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేసవిలో నిమ్మరసం నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ దూరమై, శరీరం తాజాగా ఉంటుంది.
  • నిమ్మరసం విటమిన్ సి అందించి, రోగనిరోధక శక్తిని పెంచి, చర్మానికి గ్లో ఇస్తుంది.
  • లెమన్ వాటర్ జీర్ణక్రియను మెరుగుపరచి, బరువు తగ్గడానికి, నోటి దుర్వాసన నివారణకు సహాయపడుతుంది.
  • రోజుకు 1-2 గ్లాసుల నిమ్మరసం తాగడం మంచిది, మితిమీరితే సమస్యలు రావొచ్చు.

Drinking Lemon Water Daily in Summer : వేసవిలో వేడిని తట్టుకోవడానికి శరీరానికి నీరు అవసరం అవుతాయి. అందుకే నీటితో పాటు.. డ్రింక్స్, హైడ్రేషన్ ఇచ్చే ఫుడ్స్ తీసుకుంటారు. అయితే ఇలా ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో నిమ్మరసం కలిపిన నీరు తాగడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది కేవలం దాహం తీర్చడమే కాకుండా.. శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందని చెప్తున్నారు. మరి దీనిని ఎలా చేసుకోవాలి? రోజులో ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదో చూసేద్దాం. 

హైడ్రేషన్‌కు బెస్ట్ డ్రింక్

వేసవిలో నిమ్మరసం నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. చెమట వల్ల కోల్పోయిన ద్రవాలను తిరిగి శరీరానికి అందిస్తుంది. దీంతో మీరు రోజంతా ఫ్రెష్‌గా ఉంటారు.

విటమిన్ సి కోసం..

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి.. జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. సీజన్ మారిన సమయంలో దీనిని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి. అలాగే చర్మానికి కూడా మంచి గ్లో వస్తుంది.

మెరుగైన జీర్ణక్రియ

లెమన్ వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. భోజనం తర్వాత తాగితే ఇంకా మంచిది. సమ్మర్లో వచ్చే జీర్ణ సమస్యలు దూరం చేసుకోవడానికి దీనిని తీసుకోవచ్చు. 

బరువు తగ్గడానికి.. 

నిమ్మరసం నీరు మెటాబాలిజాన్ని పెంచి.. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో ఉదయం తాగితే ఫలితం ఎక్కువగా ఉంటుంది. జీవక్రియ మెరుగుపడితే కేలరీలు త్వరగా బర్న్ అవుతాయి. ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది. 

నోటి దుర్వాసన దూరం

నిమ్మరసంలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. ఉదయం తాగితే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. 

డిటాక్స్ కోసం..

లెమన్ వాటర్ శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయం చేస్తుంది. లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల అలసట దూరమై.. ఎనర్జిటిక్గా ఉంటారు. అందుకే ఇది తాగితే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

ఎంత తాగితే మంచిదంటే..

రోజుకు 1 లేదా 2 గ్లాసుల లెమన్ వాటర్ సరిపోతుంది. ఒక గ్లాస్ నీటిలో అర నిమ్మకాయ రసం కలిపి తీసుకుంటే చాలు. ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్, మధ్యాహ్నం లేదా సాయంత్రం ఒక గ్లాస్ తాగవచ్చు. అంతకుమించి ఎక్కువగా తాగితే యాసిడ్ ఎక్కువై గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. అలాగే దంతాల ఎమల్షన్ దెబ్బతినే అవకాశం ఉంది. అలాంటి ఇబ్బంది ఉన్నవారు స్ట్రా ఉపయోగించి తాగితే మంచిది. అల్సర్ ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మితిమీరకుండా సరైన మోతాదులో తీసుకుంటేనే పూర్తి ప్రయోజనం ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Embed widget