అన్వేషించండి

Mango Buying Tips : మామిడిపండ్లు కొనేప్పుడు టేస్టీ ఫ్రూట్స్ కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. కెమికల్స్‌తో పండించినవిని ఇలా గుర్తించండి

Natural vs Artificial Mangoes : మామిడిపండ్లు కొనేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు. మరి సహజమైన, టేస్టీ పండ్లు ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సహజ మామిడిపండ్లను రంగు, వాసన, స్పర్శతో గుర్తించవచ్చు.
  • కృత్రిమ పండ్లపై నల్లటి మచ్చలు, అసహజమైన తెల్లటి పొడి ఉంటుంది.
  • నీటిలో వేస్తే సహజ పండ్లు మునుగుతాయి, కృత్రిమ పండ్లు తేలుతాయి.
  • రసాయనాలతో పండించిన మామిడిపండ్లు ఆరోగ్యానికి హానికరం, తినకూడదు.

Mangoes Smart Buying Tips : వేసవి అంటే చాలామందికి గుర్తొచ్చేది మామిడిపండ్లే. ఉగాది తర్వాత పచ్చడి మామిడికాయలతో పాటు.. మామిడి పండ్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇవి వాటి రుచి, సువాసనతో బాగా ఆకట్టుకుంటాయి. అందుకే వీటిని పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడు మార్కెట్లో లభించే అన్ని మామిడిపండ్లు సహజంగా పండినవి కావు. కొన్నింటిని కెమికల్స్‌తో త్వరగా పండిస్తారు. ఇవి రుచి లేకపోవడంతో పాటు.. ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తాయి. 

అందుకే మామిడిపండ్లు కొనేటప్పుడే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి అంటున్నారు. ముందుగానే వీటిని ఫాలో అవ్వడం వల్ల కృత్రిమంగా పండించిన పండ్లను సులభంగా గుర్తించవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. మరి మంచిగా పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించవచ్చో.. కృత్రిమ పండ్లకు ఎలా దూరంగా ఉండొచ్చో చూసేద్దాం. 

రంగును గమనించండి

సహజంగా పండిన మామిడిపండ్లు పూర్తిగా ఒకే రంగులో ఉండవు. కొద్దిగా పచ్చ, పసుపు మిక్స్‌గా ఉంటాయి. కానీ కెమికల్స్‌తో పండించిన మామిడి పండ్లు పూర్తిగా పసుపు లేదా షైనీగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తాయి.

వాసన చూడండి..

సహజంగా పండిన పండ్లు మధురమైన సువాసనతో ఉంటాయి. కృత్రిమంగా పండించిన మామిడిపండ్లకు వాసన తక్కువగా లేదా అసహజంగా ఉంటుంది.

పండును నొక్కండి.. 

సహజంగా పండిన మామిడి కొద్దిగా మృదువుగా ఉంటుంది. కెమికల్‌తో పండించినది బయట మృదువుగా కనిపించినా లోపల గట్టిగా ఉండొచ్చు. కాబట్టి పండు కొనే ముందు కాస్త నొక్కి చెక్ చేసుకోవాలి. 

నల్లటి మచ్చలు

మామిడి పండుపై చాలా ఎక్కువగా నల్లటి మచ్చలు, అసహజమైన స్పాట్స్ ఉంటే.. అది కృత్రిమంగా పండిందని అర్థం. 

రుచిలో మార్పులు.. 

సహజంగా పండిన పండు తియ్యగా, జ్యూసీగా ఉంటుంది. కృత్రిమంగా పండినది కొంచెం టేస్ట్ లేకుండా ఉంటుంది. చూసేందుకు మంచిగా ఉన్నా.. అంతగా రుచించదు.

నీటిలో వేస్తే.. 

మామిడిపండును నీటిలో వేసినప్పుడు.. సహజంగా పండిన మామిడి పండు మునిగిపోతుంది. కృత్రిమంగా పండినది తేలిపోతుంది. 

పండు లోపలి రంగు 

సహజంగా పండిన పండులో రంగు సమంగా ఉంటుంది. కెమికల్ పండ్లలో లోపల తెల్లగా లేదా అసమానంగా ఉండొచ్చు. 

తెల్లటి పొడి

పండ్లు ఎక్కువకాలం తాజాగా కనిపించేందుకు, పసుపుగా ఉండేందుకు కాల్షియం కార్బైడ్ వంటి కెమికల్స్ వాడతారు. అవి వాడితే పండుపై తెల్లటి పొడి కనిపిస్తుంది.

ఇలా కృత్రిమంగా పండించిన మామిడిపండ్లను గుర్తిస్తే వాటికి దూరంగా ఉంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి జీర్ణ సమస్యలు కలిగిస్తాయి. అలాగే తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఎక్కువకాలం తింటే ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నారు.

మామిడి తినాలంటే

మార్కెట్లో పండ్లు కొన్న తర్వాత వాటిని బాగా కడగాలి. ఆ తర్వాత తినాలి. వీలైతే ఆర్గానిక్ లేదా నమ్మకమైన చోట మాత్రమే మామిడి కొనండి. అలాగే పండు తినే ముందు కొద్దిసేపు నీటిలో నానబెట్టండి. కాబట్టి మామిడిపండ్లు కొనేటప్పుడు కంగారు పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే కెమికల్ బేస్డ్ మామిడి పండ్లకు దూరంగా ఉంటారు. సహజంగా పండిన పండ్లనే ఎంచుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget