Anger management: కోపం కట్టలు తెగుతోందా? ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు
నిజానికి కోపం అనేది చాలా అవసరమైన, ఉపయోగకరమైన భావోద్వేగాల్లో ఒకటి. కోపం వల్ల చాలా పనులు నెరవేరుతాయని, కానీ అదే ఒక్కోసారి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. మరి దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా?
సహనం నశించింది. ఆంగ్జైటీ పెరిగిపోయింది. మీ ఓపిక బ్రేకింగ్ పాయింట్ కి చేరింది. మనలో చాలా మందికి ఒక్కసారైనా కోపంతో అరవకుండా రోజు గడవదంటే ఈరోజుల్లో అతిశయోక్తి కాదు. మెంటల్ హెల్తో ఫౌండేషన్ వెలువరించిన నివేదికలో మనలో 12 శాతం మంది కోపాన్ని అదుపులో పెట్టుకునేందుకు చాలా కష్టపడుతున్నారట. 28 శాతం మంది తమకొచ్చే కోపాన్ని గురించి ఆందోళనపడుతున్నారట. 64 శాతం మంది అందరూ కోపంగా ఉంటారని నమ్ముతున్నారట.
ముందుగా మీ కోపాన్ని గుర్తించాలి
మీకోపం ఎలా ఉంటుందనేది మీరు గుర్తించగలిగితే దాన్ని ఎలా వాడాలో మనకు అర్థం అవుతుంది. గుండె వేగం పెరగడం, పిడికిలి బిగుసుకోవడం వంటివి చాలా మందికి తెలుసు కానీ గుర్తించలేని కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం.
కండరాలు బిగుసుకోవడం, కోపం హద్దుమీరితే ఏడుపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీకు కోపం తెప్పించే అంశాలు ఏమిటి అని ముందుగా తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో కోపం ఎందుకు అనే విషయంలో స్పష్టత ఉండదు. మీకు తెలియకుండానే కోపం మనసులో పేరుకుని పోయి ఉంటుంది. కానీ మీరు ఇవ్వాళ వంట బాలేదని మీ ఆవిడతో గొడవపడుతారు. అసలు కోపానికి కారణం ఆఫీసులో మీరు టార్గెట్ రీచ్ కాలేరేమో అనే ఆంగ్జైటి కావచ్చు.
చాలా సార్లు అన్యాయానికి గురైన వారిలో కోపం గూడు కట్టుకుని ఉంటుంది. మోయలేని భారంగా మారుతుంది కూడా. ఇలాంటి సందర్భంలో కౌన్సెలింగ్ చాలా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.
కోపం అవసరమే
చాలా సందర్భాల్లో కోపం సహేతుకంగానే ఉంటుంది. అలాంటి కోపాన్ని విస్మరించకూడదు. కోపాన్ని అణచిపెట్టుకోవడం కొన్ని సార్లు కోప్పడడం కంటే కూడా ఘోరంగా ఉంటుంది. కోపానికి మంచి కారణం ఉందని గుర్తించాలి. కొన్ని పనులు సాధించుకునేందుకు కోపం ఒక బలం అవుతుంది. బలంగా నిలబడి పోరాడేందుకు దోహదం చేస్తుంది.
కోపాన్ని సరిగ్గా ప్రాసెస్ చెయ్యడం కీలకం
కోపంతో చేతిలోని వస్తువు విసిరేసే బదులుగా ఎవరితో మాట్లాడితే పనులు జరుగుతాయో చూసి వాళ్లతో మాట్లాడడం మంచిది. మన కోపాన్ని ఎవరో ఒకరి మీద చూపిస్తుంటాం. అలా కాకుండా కోపాన్ని సరైన రీతిలో ప్రాసెస్ చెయ్యగలగాలి. ఇలా కోపాన్ని ప్రాసెస్ చెయ్యడానికి కౌన్సెలింగ్ ద్వారా, అభిరుచుల మీద దృష్టి నిలపడం చిన్నచిన్నమార్పుల ద్వారా ఆనందాలను గుర్తించడం వంటివి ప్రభావాన్ని చూపుతాయి.
కోపంలో మాట్లాడొద్దు
కోపాన్ని మరో వైపు మళ్లించకూడదు. మరొకరి మీద చూపించకూడదు. మీరు చెప్పేది నిజమే అయినా కోపంగా కాకుండా సంయమనంతో వివరించాలి. మీరు చెప్పేది నిజమే అయినా పరుష పదజాలం కూడదు. పది నిమిషాల సంయమనం పాటించడం మంచిది. కోపం వల్ల కొందరు మాట్లాడలేరు కూడా. కోపం అదుపులోకి తెచ్చుకోవడానికి కాసేపు నడవడం లేదా వర్కవుట్ చెయ్యడం, ఒంటరిగా నడవడం వంటి మార్గాలు చూసుకోవాలి.
నిపుణుల సహాయం ఎప్పుడు తీసుకోవాలి?
మీ కోపం ఎప్పుడు హద్దులు దాటిందో తెలుసుకోవడం కొంచెం కష్టమే. మీ ప్రవర్తన మీ చుట్టూ ఉన్న వారు మిమ్మల్ని భరించడం కష్టమయ్యే పాయింట్ ఒకటి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొలిగ్స్ మిమ్మల్ని వదిలేస్తూ దూరం అవుతుంటారు. కోపం చాలా ఎక్కువైనపుడు దాని ప్రభావం ఆరోగ్యం మీద కూడా ఉంటుంది. తరచుగా కోపం వస్తుండటాన్ని గమనిస్తే కోపాన్ని అదుపు చెయ్యడానికి ఈ చిన్న చిట్కాలు పనిచేస్తాయి.
- కోపంలో రియాక్ట్ కాకుండా ఆగి ఆలోచించాలి.
- అందరూ ఒకే అభిప్రాయంతో ఉండరు. బిన్నాభిప్రాయాలు ఉంటాయని అంగీకరించాలి.
- ఎదుటి వారు చెప్పేది లోతుగా విని అర్థంచేసుకునే ప్రయత్నం చెయ్యాలి.
- మీకు సాయం చేసే వారి సహాయం తీసుకోవాలి.
- కోపంలో మాట్లాడడం కంటే రాయడం మంచిది.
- అన్ని విషయాలను వ్యక్తిగతంగా తీసుకోకూడదని గ్రహించాలి.
కారణం లేకుండా కోపం వస్తున్నట్టు మీకు అనిపిస్తే, అకారణంగా కోపంగా, అసహనంగా ఉంటుందని అనిపిస్తే అది మీలోపల గూడు కట్టుకున్న డిప్రెషన్ కు కారణం కావచ్చు. కనుక వెంటనే మానసిక నిపుణుల సహాయం తీసుకోవడం అవసరం. ఇలాంటి స్థితి మీ శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావంచూపించే ప్రమాదం ఉంటుంది.
Also read: ఆరేళ్ల బాలికకు వింత వ్యాధి, ఈమె శ్వాస తీసుకోవడం మర్చిపోతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.