అన్వేషించండి

ఆరేళ్ల బాలికకు వింత వ్యాధి, ఈమె శ్వాస తీసుకోవడం మర్చిపోతుంది

ప్రపంచంలో అరుదైన వ్యాధులు ఎక్కువ అయిపోతున్నాయి. అలాంటి ఓ అరుదైన వ్యాధి బారిన పడింది ఆరేళ్ల పాప.

ఏ వ్యాధి బారిన పడినా... శ్వాస తీసుకోవడం మాత్రం మెదడు మర్చిపోదు. కానీ ఓ ఆరేళ్ల పాప మాత్రం నిద్రపోతూ శ్వాస తీసుకోవడం మర్చిపోతుంది. అలా ఆమె మరణం బారిన పడే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడం మర్చిపోయి, మరణం అంచుల వరకు వెళ్లి ఎన్నోసార్లు వచ్చింది. ఇది ఒక విచిత్రమైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా కేవలం 1000 మంది లోపే ఈ వ్యాధి బారిన పడినవారు ఉన్నారు. ఇది ఒక అస్పష్టమైన నాడీ సంబంధిత వ్యాధిగా చెబుతున్నారు వైద్యులు. పుట్టుకతోనే ఈ రోగం వస్తుంది. ఆంగ్లంలో దీన్ని ‘సెంట్రల్ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్’ అని పిలుస్తారు. బ్రిటన్ లోని ఆరేళ్ల పాప సాడీ ఇలా శ్వాస తీసుకోవడం మర్చిపోయే రోగంతో బాధపడుతోంది. 

సాడీ తల్లి మాట్లాడుతూ ప్రతి రాత్రి తాము తమ పాపను చాలా జాగ్రత్తగా చూసుకుంటామని చెబుతోంది. ఆమె మెదడు ఊపిరి పీల్చుకోవడం మర్చిపోతుందని, అందుకే రాత్రి పడుకునే ముందు లైఫ్ సపోర్ట్ సిస్టం పెట్టి నిద్రపుచ్చుతామని వివరిస్తోంది. లేకుంటే ఏ క్షణమైనా సాడీ శ్వాస ఆగిపోవచ్చని చెబుతోంది. 

సాడీకి శ్వాస ఆగిపోయిన క్షణంలో శరీరం నీలం రంగులోకి మారడం ప్రారంభిస్తుందని తల్లి వివరిస్తోంది. పుట్టుకతోనే సాడికీ సమస్య వచ్చిందని, కానీ పుట్టినప్పుడు అందరి పిల్లలాగే జన్మించిందని తెలిపింది. అయితే ప్రసవం అయ్యాక పాపని ఆరు నెలల పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచాల్సి వచ్చిందని చెప్పింది. ఆమె శ్వాసకోశ పరిస్థితి బాగో లేకపోవడంతో అలా చేయాల్సి వచ్చిందని తెలిపింది. పాపకి రెండు నెలల వయసు ఉన్నప్పుడే శ్వాస తీసుకోవడానికి ఆమె మెడలో ఒక చిన్న ‘ట్రాకియోటమీ’ని పెట్టారు. దాని వల్లే సాడీ ఊపిరి పీల్చుకోగలుగుతుంది. అది లేకుండా  పాప స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలంటే సర్జరీ చేయాల్సి ఉంటుంది. మెడలోని ఫ్రెనిక్ నరాలలో పేసర్ ఇంప్లాంట్ చేయాలి. ఇందుకోసం చాలా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఆ సర్జరీ కావలసిన నిధులను సేకరించే పనిలో ఉంది ఆమె కుటుంబం.

సెంట్రల్ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
హార్వర్డ్ హెల్త్ చెబుతున్న ప్రకారం, సెంట్రల్ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ పుట్టుకతోనే వస్తుంది. నాడీవ్యవస్థను, శ్వాసక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఉన్న వ్యక్తులు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడతారు. నిద్రిస్తున్నప్పుడు శ్వాస ఆగిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల  రక్తంలో ఆక్సిజన్ తగ్గి, కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతుంది. దీని వల్ల మరణం సంభవిస్తుంది.

Also read: నేను ఒకే ఒకసారి నా భార్యను మోసం చేశాను, కానీ ఆమె ఎప్పటికీ నన్ను క్షమించడం లేదు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

DIY Hair Pack : మందార పువ్వు, కొబ్బరి పాలుతో హెయిర్ ప్యాక్.. జుట్టు రాలడాన్ని తగ్గించి మెరుపును పెంచుతుందా?
మందార పువ్వు, కొబ్బరి పాలుతో హెయిర్ ప్యాక్.. జుట్టు రాలడాన్ని తగ్గించి మెరుపును పెంచుతుందా?
Sri Lankan Chilli Vada Recipe : శ్రీలంక స్పెషల్ మిర్చి వడ.. టేస్టీ, క్రంచీ స్నాక్ కోసం ఈ రెసిపీ ట్రై చేసేయండి
శ్రీలంక స్పెషల్ మిర్చి వడ.. టేస్టీ, క్రంచీ స్నాక్ కోసం ఈ రెసిపీ ట్రై చేసేయండి
Vaginal Health Tips : యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏమి చేయాలి? ప్రతి మహిళ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏమి చేయాలి? ప్రతి మహిళ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
Sweet Cravings During Weight Loss : బరువు తగ్గాలని షుగర్స్ మానేశారా? స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఈ హెల్తీ ఆప్షన్స్ ట్రై చేయండి
బరువు తగ్గాలని షుగర్స్ మానేశారా? స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఈ హెల్తీ ఆప్షన్స్ ట్రై చేయండి

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Pre Release Event Live Highlights: చచ్చేవరకు ఎంటర్టైన్ చేస్తా... రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్ - 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
చచ్చేవరకు ఎంటర్టైన్ చేస్తా... రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్ - 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
K Annamalai launch new party Tamil Nadu: బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!
బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడులో సరికొత్త పార్టీ స్థాపనకు మాజీ ఐపీఎస్ స్కెచ్!
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Dhurandhar Washma Butt Chai Shop Real Location: ధురంధర్‌ సినిమా ఎఫెక్ట్‌! లడఖ్‌లో టీ కొట్టు కిటకిట! అసలు రీజన్ ఏంటంటే?
ధురంధర్‌ సినిమా ఎఫెక్ట్‌! లడఖ్‌లో టీ కొట్టు కిటకిట! అసలు రీజన్ ఏంటంటే?
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
Chiranjeevi : నాని మూవీలో మెగాస్టార్... నెక్స్ట్ సినిమాతో లింక్ - శ్రీకాంత్ ఓదెల సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్?
నాని మూవీలో మెగాస్టార్... నెక్స్ట్ సినిమాతో లింక్ - శ్రీకాంత్ ఓదెల సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్?
Embed widget