(Source: ECI/ABP News/ABP Majha)
Silver Anklets: అమ్మాయిలు వెండి పట్టీలు ధరిస్తే ఆ నొప్పులన్నీ మాయం
కాలికి పట్టీలు పెట్టుకోవడం భారతీయ మహిళలకు అలవాటే.
ఒకప్పటి పరిస్థితి వేరు... ఆడపిల్లకు కాలికి పట్టీలు కచ్చితంగా పెట్టాల్సిందే. అలాగే పెళ్లయ్యాక వెండి మెట్టెలు కూడా కాలి వేళ్ళకు పెట్టుకోవడం ఖచ్చితం. ఇప్పుడు ఆధునిక కాలంలో అన్ని మారిపోయాయి, పట్టీలు పెట్టుకునేవారు, మెట్టెలు పెట్టుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. నిజానికి వెండి పట్టీలు, వెండి మెట్టెలు ధరించడం భారతీయ సంప్రదాయాల్లో భాగమే కాదు, అది ఆడపిల్లలకు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. వెండి శరీరానికి తగ్గట్టు ప్రతిస్పందించే ఒక లోహం. వెండి అనేది సానుకూల శక్తిని శరీరానికి అందిస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అమ్మాయిలలో హార్మోన్ల స్థాయిలను సమతుల్యం చేస్తుంది. మెరుగైన రక్తప్రసరణ కోసం వెండి మన శరీరాన్ని తాకుతూ ఉండడం అవసరమని చెబుతారు అధ్యయనకర్తలు. అలాగే కొంతమంది ఆడవాళ్లకు పీరియడ్స్ సమయంలో నొప్పులు వస్తాయి. వాటిని తగ్గించేందుకు కూడా వెండి పట్టీలు సహాయం చేస్తాయని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. రుతునొప్పితో బాధపడుతున్న స్త్రీలు వెండి పట్టీలు, వెండి మట్టెలు, వెండి వస్తువులు ధరించడం వల్ల ఆ నొప్పి కాస్త తగ్గుతుందని వివరిస్తున్నారు.
పూర్వం అధికంగా వెండి నగలను ఉపయోగించేవారు. మొహంజదారో వంటి పురాతన నాగరికతలలో కూడా వెండి నగలు ఎన్నో బయటపడ్డాయి. అప్పట్లో ఒంటినిండా వెండి నగలతోనే ఎక్కువ మంది తయారయ్యేవారు. వెండి అనేది ఒక విద్యుత్ వాహకం అని చెప్పుకోవాలి. ఈ లోహానికి నిర్దిష్ట లక్షణాలు ఉంటాయి. మానవ శరీరంపై ఇది సానుకూల ప్రయోజనాలను చూపిస్తుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీ మైక్రో బయల్ ఏజెంట్. ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కూడా శరీరానికి ఇస్తుంది. శరీరంపై అయిన గాయాలు నయం అయ్యేందుకు కూడా సహకరిస్తుంది. వెండి శరీరంలోని వేడిని నియంత్రించే శక్తిని కలిగి ఉంటుంది. అలాగే రక్తప్రసరణకు సహాయపడుతుంది. వెండితో ఎన్నో వైద్య పరికరాలను కూడా తయారు చేశారు. విషపూరితమైన పదార్థాలను గుర్తించడానికి ఇది మనకు సహకరిస్తుంది. విషపూరిత పదార్థాలు దీనికి తాకగానే తన రంగును మార్చుకుంటుంది.
సౌతాంఫ్టన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు వెండి ఉంగరాన్ని ధరించడం వల్ల ఆర్థరైటిస్ చేతులకు వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చని, అలాగే ఆర్థరైటిస్ వచ్చాక వెండి వస్తువులు ధరించడం వల్ల దాని లక్షణాలను తగ్గించుకోవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడేవారు వెండి స్ప్లింట్లను ధరించడం వల్ల నొప్పి తగ్గుతుందని ఒక అధ్యయనం చెబుతోంది. వెండి ఆభరణాలను ధరించడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ధ్యానం, యోగా వంటి వాటిపై మనసు మళ్లుతుంది. కాబట్టి వెండి వస్తువులకు ఎక్కువ విలువ ఇవ్వండి. వీలైనంతవరకు వెండి వస్తువులు ధరించేందుకు ప్రయత్నించండి.
Also read: కొంతమంది పిల్లల్లో నత్తి ఎందుకు వస్తుంది? తల్లిదండ్రులు ఏం చేయాలి?
Also read: మాంసాహారం తినడం తగ్గిస్తే బెటర్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.