అన్వేషించండి

Heart Problems: మాంసాహారం తినడం తగ్గిస్తే బెటర్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి

గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవాలంటే మాంసాహారం తక్కువగా తినాలి.

మన జనాభాలో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ. ప్రతిరోజూ ముక్క లేనిదే ముద్ద దిగని వారెందరో. కానీ మాంసాహారాన్ని అధికంగా తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా పెరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గుండెపోటు, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే కొన్ని ఆహార నియమాలను పాటించాలి. వాటిలో ఒకటి మాంసాహారం తగ్గించడం. అలాగే మద్యపానం, ధూమపానం కూడా తగ్గించాలి. వ్యాయామం రోజు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని మీకు మీరే తగ్గించుకున్న వారు అవుతారు.

మాంసాహారానికి, గుండె జబ్బులకు ఏమిటి సంబంధం? అని చాలామందికి సందేహం రావచ్చు. గుండె జబ్బులు అధికంగా వచ్చేది గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినప్పుడే. మాంసాహారం తినడం వల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే సమస్య పెరుగుతుంది. దీనివల్ల రక్తసరఫరా గుండె నుంచి అవయవాలకు తిరిగి అవయవాల నుంచి గుండెకు సరిగా జరగదు. దీనివల్లే గుండెపోటు వచ్చే ఛాన్స్ అధికంగా ఉంటుంది. కాబట్టి మాంసాహారాన్ని తగ్గించుకోవడం ద్వారా గుండెను కాపాడుకోవచ్చు.

మాంసాహారంలో కొలిన్ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఎల్ కార్నిటైన్ అనే రసాయనం కూడా ఉంటుంది. జీర్ణం అయ్యాక కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి. ఆ రసాయనాలు రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటానికి సహాయపడతాయి. నిజం చెప్పాలంటే హై బీపీ, రక్తంలో అధిక కొలెస్ట్రాల్ కన్నా కూడా విడుదలైన ఈ రసాయనాలే ఎక్కువగా గుండె జబ్బును కలిగించే అవకాశం ఉంది. రక్తనాళాల్లో పూడికలు ఏర్పరిచే ఛాన్సులు అధికం. దీని వల్ల గుండె పోటు ఎప్పుడైనా రావచ్చు.

కాబట్టి మాంసాహారాన్ని తగ్గించుకుంటే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే సమస్య తగ్గుతుంది. తద్వారా గుండెను కాపాడుకోవచ్చు. పేగులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మాంసాహారాన్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తినాలి. ప్రతిరోజూ తినడం మానుకోవాలి.  మాంసాహారం తినేవారిలో దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉంది. వాటి బారిన పడకుండా ఉండాలంటే మాంసాహారాన్ని తగ్గించాలి. మాంసాహారం తగ్గించడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం తగ్గుతుంది. శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. అన్నీ ఆరోగ్యకరమైన మార్పులు కలుగుతాయి. మాంసాహారం అధికంగా తినడం వల్ల కోపం, అసహనం వంటివి తగ్గుతాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. జీవకణాలు దెబ్బతినకుండా ఉంటాయి. మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మాంసాహారాన్ని తగ్గించుకుని పండ్లు, కూరగాయలు, నట్స్ వంటివి అధికంగా తినాలి. 

Also read: పిల్లలకు గంట కంటే ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారా? వారి ఆరోగ్యం మీరే చెడగొడుతున్నట్టు లెక్క

Also read: కాల్చిన మొక్కజొన్న vs ఉడికించిన మొక్కజొన్న, రెండింట్లో ఏది బెటర్?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

టాప్ హెడ్ లైన్స్

Onion Samosa : ఆనియన్ సమోసా రెసిపీ.. ఇంట్లోనే క్రిస్పీగా, టేస్టీగా ఇలా చేసుకోండి
ఆనియన్ సమోసా రెసిపీ.. ఇంట్లోనే క్రిస్పీగా, టేస్టీగా ఇలా చేసుకోండి
Urine Leaking : తుమ్మినా, దగ్గినా మూత్రం లీక్ అవుతుందా? ఈ సమస్యకు కారణం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
తుమ్మినా, దగ్గినా మూత్రం లీక్ అవుతుందా? ఈ సమస్యకు కారణం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
Hair Oils for Men : మగవారికి జుట్టుకు ఏ ఆయిల్ మంచిది? హెయిర్ ఫాల్, పలుచబడిన జుట్టుకు ఇవి ట్రై చేయండి
మగవారికి జుట్టుకు ఏ ఆయిల్ మంచిది? హెయిర్ ఫాల్, పలుచబడిన జుట్టుకు ఇవి ట్రై చేయండి
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget