అన్వేషించండి

Alia Bhatt Favorite Desert : ప్రెగ్నెన్సీ సమయంలో బెంగాలీ స్వీట్​పై మనసు పడేసుకున్న ఆలియా.. రెసిపీ ఇదే

Bengali Sweet Recipe : ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది ఫుడ్ క్రేవింగ్స్​తో ఉంటారు. అలాగే ఆలియా భట్​కి కూడా రాహా కడుపులో ఉన్నప్పుడు ఓ బెంగాలీ స్వీట్​ మీద ఎక్కువ మనసు ఉండేదట..

Nolen Gud Sandesh Recipe : ప్రెగ్నేన్సీ సమయంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదొక ఫుడ్​ని ఎక్కువగా తింటూ ఉంటారు. తినేకొద్ది వాటిని తినాలనే క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయంటారు. ఆలియా భట్​కి కూడా రాహా కపూర్ కడుపులో ఉన్నప్పుడు ఓ బెంగాలీ స్వీట్​ని తెగ తినేదంట. తాజాగా ఈ విషయాన్ని ఆమె డైటీషన్ బయటపెట్టారు. ఇంతకీ ఆ స్వీట్ ఏంటి? దానిని ఎలా తయారు చేయాలి? నిజంగా ఆ స్వీట్ అంత మంచిగా ఉంటుందా వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

రణ్​బీర్ కపూర్​ని ఆలియా ప్రేమించి కొన్నాళ్లు రిలేషన్​లో ఉన్న తర్వాతా ఏప్రిల్ 2022న పెళ్లిచేసుకుంది. అదే సంవత్సరం వారు రాహాకు జన్మనిచ్చారు. ఆలియా ప్రెగ్నెంట్​గా ఉన్నప్పుడు ప్రముఖ పోషకాహార నిపుణుడి దగ్గర తన డైట్​ తీసుకునేవారు. అయితే తన తరచుగా బెంగాలీకి చెందిన స్వీట్​ మాత్రం కావాలని అడిగేదంట. అదే నోలెన్ గుడ్ సందేశ్‌. పేరు వినడానికి వెరైటీగా ఉంది కదా.. కానీ ఇది తినడానికి చాలా బాగుంటుందట. మరీ ఈ స్వీట్​ని ఎలా తయారు చేయాలో? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

క్రీమ్ పాలు - రెండున్నర లీటర్లు

చీజ్ - 500 గ్రాములు

వెనిగర్ -3 టేబుల్ స్పూన్లు 

బెల్లం - 2 కప్పులు

నెయ్యి - అర టీస్పూన్

ఎండు ద్రాక్ష - 20 

తయారీ విధానం

ముందుగా స్టౌవ్ వెలిగించి మందపాటి అడుగు కలిగిన పాన్​ను స్టౌవ్ మీద ఉంచండి. దానిలో పాలను వేసి వేడి చేయండి. పాలు మరిగే సమయంలో మంటను తగ్గించి.. ఓ చెంచా వెనిగర్ వేసి పాలను నెమ్మదిగా కలపండి. ఇప్పుడు మంటను పెంచండి. పాలు వెనిగర్ వల్ల విరిగిపోతాయి. ఇప్పుడు స్టౌవ్​ను ఆపేసి.. వాటిని చల్లారనివ్వండి. విరిగిపోయిన పాలు పూర్తిగా చల్లారిన తర్వాత.. వాటిని మస్లిన్ క్లాత్​లో లేదా కాటన్ క్లాత్​లో వేయాలి. ఇప్పుడు నీరు వెళ్లిపోతుంది. 

పాల విరుగుడులోని వెనిగర్ రుచిని తొలగించడానికి.. దానిని చల్లని నీటితో కడగాలి. రెండు మూడు సార్లు కడిగితే వెనిగర్ రుచి పోతుంది. ఇప్పుడు పాలు పదార్థంలోని అదనపు నీటిని తొలగించాలి. వస్త్రాన్ని మూటగా కట్టి పిండితే.. దానిలో నీరంతా బయటకు పోతుంది. ఇంకేమైనా నీరు ఉంటే.. దానిని ఎక్కడైనా కట్టి ఓ అరగంట వేలాడదీస్తే దానిలోని నీరు పూర్తిగా బయటకు పోతుంది. 

ఇప్పుడు చీజ్​ని ఒక ప్లేట్​లోకి తీసుకుని.. అరచేతితో మెత్తగా అయ్యేలా చేయాలి. అది మెత్తగా అయ్యేలోపు.. స్టౌవ్ వెలిగించి.. ఓ గిన్నె పెట్టి దానిలో తురిమిన బెల్లం వేయండి. దానిలో అరకప్పు నీటిని వేసి కొన్ని నిమిషాలు ఉడకనివ్వండి. బెల్లం దానిలో కరిగిపోయే వరకు ఉంచండి.. ఇప్పుడు దానిని పక్కన ఉంచి చల్లారనివ్వండి. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని.. దానిలో మెత్తగా చేసుకున్న చీజ్​ను వేసి.. దానిలో కరిగించిన బెల్లాన్ని వడకట్టండి. ఇప్పుడు మంటను తక్కువ చేసి.. నెమ్మదిగా కలుపుతూ ఉండండి. చీజ్​లో బెల్లం కలిసి.. నూనెలాంటి మిశ్రమం.. వదిలేస్తున్నప్పుడు స్టౌవ్ ఆపేయాలి. 

బెల్లం మిశ్రమాన్ని.. ముందుగా తయారు చేసి పెట్టుకున్న విరిగిన పాలల్లో కలిపి మిక్స్ చేయాలి. దీనిని బ్లెండర్​లో వేసి కలుపవచ్చు. లేదంటే చేతితో కూడా కలపవచ్చు. అంతే వేడి వేడి బెంగాలీ స్వీట్ రెడీ అయిపోయినట్లే. దీనిని మీకు నచ్చిన షేప్​లలో తయారు చేసుకోవచ్చు. ఎండుద్రాక్షలతో దీనిని గార్నిష్ చేయవచ్చు. మీరు వాటిని వద్దు అనుకుంటే మానేయొచ్చు. ఎందుకంటే ఎండుద్రాక్ష పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బెంగాలీ రెసిపీని ఇంట్లో తయారు చేసుకుని ఆస్వాదించేయండి. 

Also Read : హోటల్ స్టైల్ పూరీ కర్రీ.. ఈ సింపుల్ రెసిపీ మంచి టేస్ట్ ఇస్తుంది..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

APPSC on Group 2 Mains | గ్రూప్ 2 పరీక్ష యధాతథమన్న APPSC | ABP DesamSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ | ABPSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ను పరిశీలించిన మంత్రి ఉత్తమ్Chicken Biryani and roast Free | గుంటూరు ఉచిత చికెన్ మేళాకు భారీగా భోజన ప్రియులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Hyderabad Metro Rail :హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
 ICC Champions Trophy Aus Vs Eng Result Update: ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
TSRTC Special Buses:4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget