అన్వేషించండి

Protein Shake: ప్రోటీన్ షేక్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్న టీనేజర్, దాని వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్

ప్రోటీన్ షేక్ తాగి అరుదైన వ్యాధితో ఓ టీనేజర్ మరణించాడు.

Protein Shake: ప్రోటీన్ షేక్ తాగడం వల్ల కండలు బలిష్టంగా అవుతాయని, బాడీ మంచి షేప్ వస్తుందని ఎంతోమంది నమ్మకం. ఇది నిజమే కానీ కొందరిలో ఇది ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. అరుదైన వ్యాధులు వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా సంభవించవచ్చు. దీనికి ఉదాహరణ రోహన్ గోధానియా. ఇతడికి 16 ఏళ్లు. తల్లిదండ్రులతో బ్రిటన్లో స్థిరపడ్డాడు. కొడుకు చాలా సన్నగా ఉండడంతో తండ్రి సూపర్ మార్కెట్లో కనిపించిన ఓ ప్రోటీన్ షేక్ కొనిచ్చాడు. అది తాగాక అతడి ఆరోగ్యం క్షీణించింది.  మొదట కడుపునొప్పిగా ఉందని చెప్పాడు. తర్వాత రెండు, మూడు వాంతులు చేసుకున్నాడు. ఆ రోజంతా ఇంకెలాంటి ప్రభావం కనబడలేదు. మరుసటి రోజు ఉదయం కళ్ళు మసక బారాయి. ఎదురుగా ఉన్న వస్తువులు కూడా కనిపించడం లేదు. దీంతో అతనిని ఆసుపత్రిలో చేర్చారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టి వైద్యం చేయించారు. సిటీ స్కాన్ తీస్తే తీవ్రమైన మెదడువాపు వచ్చినట్టు వైద్యులు చెప్పారు. శస్త్ర చికిత్స చేసినా ఫలితం ఉండదని, పరిస్థితి చేయిదాటి పోయిందని చెప్పారు వైద్యులు. ఆ తరువాత రోహన్ మరణించాడు.

 ప్రోటీన్ షేక్ తాగడం వల్ల ఆ అబ్బాయిలో ఆర్నిథైన్ ట్రాన్స్‌కార్బమైలేస్ లోపం వచ్చింది. ఆర్నిథైన్ ట్రాన్స్‌కార్బమైలేస్ అనేది కాలేయంలో అమ్మోనియాను యూరియాగా మార్చడంలో కీలకమైన ఎంజైమ్. కాలేయంలో యూరియా ఏర్పడిన తర్వాత, అది రక్తప్రవాహం ద్వారా మూత్రపిండాలకు వెళుతుంది, అక్కడ అది మూత్రం ద్వారా శరీరం నుండి బయటికి పోతుంది. ఈ లోపం రోహన్లో రావడం వల్ల  అమ్మోనియా విచ్ఛిన్నత ఆగిపోయింది.  దీనివల్ల రక్త ప్రవాహంలో అమోనియా అధికంగా చేరి ప్రాణాంతక పరిస్థితికి చేరుకుంది. దీని కారణంగానే రోహన్ మరణించినట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రొటీన్ షేక్ అనేది ఈ అరుదైన పరిస్థితి తలెత్తడానికి ట్రిగ్గర్ గా మారిందని వివరించారు వైద్యులు. 

ప్రోటీన్ షేక్ అధికంగా తాగితే అనేక రకాల సైడ్ ఎఫెక్టులు ఉంటాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.

ప్రోటీన్ పౌడర్లలో కొన్ని రకాల హార్మోన్లు, బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి సెబమ్ ఉత్పత్తిని పెంచుతాయి. చర్మంలో సెబమ్ ఉత్పత్తి అధికంగా పెరిగితే మొటిమలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జీర్ణాశయంతర సమస్యలు కూడా రావచ్చు. మాంసం, పాలు, గుడ్లు వంటి సహజ ప్రోటీన్ వనరులతో పోలిస్తే ప్రోటీన్ పౌడర్లు అసమతుల్యంగా ఉంటాయి. ప్రోటీన్ పౌడర్లలో ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల శరీరంలో పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. ప్రోటీన్ షేక్ అధికంగా తాగడం వల్ల పొట్ట నొప్పి రావడం, పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు సమస్యలు రావడం జరుగుతుంది. ప్రోటీన్ పౌడర్లు ఏవి పడితే అవి తీసుకోకూడదు. కొన్ని కంపెనీలు తయారు చేసే ప్రోటీన్ పౌడర్లలో సీసం, కాడ్మియం, ఆర్సెనిక్, పాదరసం వంటి అత్యంత విషపూరిత లోహాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి శరీరానికి చాలా హానికరమైనవి. ప్రోటీన్ షేక్ తాగిన వెంటనే తలనొప్పి, అలసట, మలబద్ధకం, కండరాలు, కీళ్లల్లో నొప్పి వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని కూడా ప్రోటీన్ షేక్ లు పెంచుతాయి. వర్కౌట్స్ తర్వాత ప్రోటీన్ షేక్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్  స్థాయిలు పెరిగే అవకాశం చాలా ఎక్కువ.

Also read: నెలసరి సమయంలో అధికంగా రక్తస్రావం అవుతుందా? దానికి ఇవి కారణాలు కావచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget