పెద్దమంటపై వంట చేస్తున్నారా? త్వరగా వంట పూర్తవ్వాలన్న కారణంగా ఎక్కువ మంది అధిక ఉష్ణోగ్రత వద్ద, పెద్ద మంట పెట్టి ఆహారాన్ని ఉడికిస్తారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెబుతోంది ఒక కొత్త అధ్యయనం. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని ఉడికించడం వల్ల ఆహారానికి చెందిన DNA దెబ్బతింటుంది. ఆ ఆహారం తినే వ్యక్తి శరీరంలో ఉన్న డిఎన్ఏ ని కూడా, ఈ ఆహారంలోని దెబ్బతిన్న డిఎన్ఏ మార్చే అవకాశం ఉంది. దీనివల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ఛాన్సులు పెరుగుతాయని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అధ్యయనం తేల్చింది. మాంసాహార వంటకాలు, డీప్ ఫ్రై చేసిన వంటకాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద వండి తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని ఈ పరిశోధన చెబుతుంది. వంట చేసే పద్ధతి మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని అర్థం చేసుకోవాలి. ఆహారంలో జన్యుపరమైన మార్పులు అనారోగ్యాలకి కారణం అవుతాయి.