ప్రమాదంలో తల్లీ శిశువుల ప్రాణాలు



ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రసూతి మరణాల సంఖ్య పెరిగిపోతోంది.



ప్రతి ఏడు సెకన్లకు ఎక్కడో ఒకచోట నవజాత శిశువు మరణించడం లేదా ప్రసవం సమయంలో తల్లి మరణించడం జరుగుతోంది.



నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రసవ సమయంలో లేదా ప్రసవం జరిగిన మొదటి వారంలో శిశువులు, బాలింతలు మరణిస్తున్నారు.



ఏటా 4.5 మిలియన్ల మంది శిశువులు, తల్లులు మరణిస్తున్నట్టు సర్వేలో తెలిసింది.



కోవిడ్ మహమ్మారి చేసిన అల్లకల్లోలం, పేదరికం, మానవతా సంక్షోభాలు వంటివన్నీ ప్రసూతి, నవజాత శిశువుల ఆరోగ్య సేవలపై ఒత్తిడి పడేలా చేస్తున్నాయి.



ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ప్రసవానికి కావాల్సిన సౌకర్యాలు కనీసం లేవు.



నవజాత శిశువుల సంరక్షణ యూనిట్లు కూడా లేవు. దీనివల్లే అక్కడ ఎక్కువ మంది పిల్లలు, తల్లులు మరణిస్తున్నారు.



సెప్సిస్, మెనింజైటిస్, నిమోనియా, నియోనాటల్ టెటానస్ వంటి ఆరోగ్య సమస్యల బారిన పడిన శిశువులు అధికంగా మరణించే అవకాశం ఉంది.