ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే వంటలకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. గుండెకి మేలు చేసే ఆయిల్స్ లో ఆలివ్ నూనె ముందుంటుంది. ఈ నూనె ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందాన్ని రెట్టింపు చేస్తుంది. వృద్ధాప్య సాంకేటాలని తగ్గిస్తుంది. యూవీ రేడియేషన్, కాలుష్యం, ఇతర విషపూరిత కారకాల నుంచి చర్మం పాడైపోకుండా ఆలివ్ ఆయిల్ రక్షిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గాయాలను త్వరగా నయం చేస్తాయి. చర్మానికి దీన్ని రాసుకుంటే హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మానికి ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలు తొలగించి ఎక్స్ ఫోలియేట చేస్తుంది. కొత్త కణాల పెరుగుదలని ప్రోత్సహిస్తుంది.