ఉదయం లేచాక గట్టిగా నవ్వితే జరిగేది ఇదే



మానసిక, శారీరక ఆరోగ్యానికి నవ్వు ఒక ఉత్తమ ఔషధం.



నవ్వినప్పుడు ఎండార్పిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది శారీరక, మానసిక స్థితిని ఆనందంగా మారుస్తుంది.



నవ్వినప్పుడు ప్రతిరోధకాల ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల రోగనిరోధక కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.



నవ్వు రక్తప్రసరణను మెరుగుపరచడమే కాదు, రక్తపోటును తగ్గిస్తుంది.



నవ్వు అనేది ఒక సహజమైన నొప్పి నివారణ మందు. శరీరంలో ఉన్న నొప్పులను తగ్గించడంలో ఇది ముందుంటుంది.



ఆధునిక జీవితంలో ఒత్తిడి భాగమైపోయింది. అనేక అధ్యయనాలు నవ్వు రక్తంలోని ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుందని చెబుతాయి.



చిరునవ్వులు చిందించడం వల్ల ఉపయోగం లేదు. మీరు ఎంత గట్టిగా నవ్వగలిగితే అంత గట్టిగా పడి పడి నవ్వండి.



అదే మీకు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని అందిస్తుంది.