వివాహం జీవితంలో ఎంతో ముఖ్యమైన దశ. మరణించేవరకు ఉండే తోడును ఎంచుకోవడమే వివాహం.
ప్రపంచవ్యాప్తంగా విడాకుల రేటు పెరిగిపోతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు విడాకుల రేటు అధికంగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి.
నమ్మకం లేకపోవడం, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వ్యసనాలు, శారీరకంగా వేధించడం, ఇద్దరికీ పడకపోవడం, అభిప్రాయాలు కలవకపోవడం వంటి కారణాలు విడాకుల రేటును పెంచుతున్నాయి.
మన దేశంలో విడాకుల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉంది. 1000 వివాహాలలో 13 మంది మాత్రమే విడాకులు తీసుకుంటున్నారు.
ఇక తక్కువ విడాకుల రేటు కలిగి ఉన్న రెండో దేశం చిలీ. చిలియన్లకు కూడా విడాకులు అంటే ఇష్టం ఉండదు.
ఐరోపాలో ఉన్న అతి చిన్న దేశాల్లో లగ్జంబర్గ్ ఒకటి. దాదాపు 87% మంది వివాహిత జంటలు విడాకులు తీసుకుంటున్నారు.
స్పెయిన్లో అనేక రకాల కారణాలవల్ల 65% మంది భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.