యాపిల్ టీ తాగితే రుచి అదిరిపోతుంది యాపిల్ టీ తాగడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు రెండుసార్లు యాపిల్ టీ తాగితే ఎంతో మంచిది. గిన్నెలో నీళ్లు వేసి టీ పొడి వేయాలి. అది బాగా మరిగాక యాపిల్ ముక్కలు వేయాలి. అందులో దాల్చిన చెక్క పొడి కూడా వేసి రెండు నిమిషాలు మరగనివ్వాలి. దీన్ని వడకట్టి తాగితే యాపిల్ టీ రుచి అదిరిపోతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటుంది ఈ టీ. దీనిలో తేనెలో వేసి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.