ఒక్క కండోమ్ ధర రూ.44 వేలు - ఎందుకో తెలుసా? కండోమ్ ధర ఎంత ఉంటుందో మీకు తెలిసిందే. ప్రభుత్వాలైతే వాటిని ఫ్రీగా లేదా తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే, ఈ కండోమ్.. ధర రూ.44 వేలు. అదేంటీ, దాన్ని బంగారంతో గానీ చేశారా? అని షాకవుతున్నారా? కానే కాదు.. పైగా అది ఇప్పటిది కాదు, చాలా పాతది. ఔనండి, ఆ కండోమ్ సుమారు 200 ఏళ్ల నాటిదట. 7 ఇంచుల పొడవుండే ఈ కండోమ్ ఫ్రాన్స్‌లో లభించిందట. ఆ కండోమ్‌ను వేలం వేయగా ఓ వ్యక్తి 460 పౌండ్లు (రూ.44 వేలు) చెల్లించి సొంతం చేసుకున్నాడట. ఇంతకీ ఆ కండోమ్‌ను దేనితో తయారు చేశారో తెలుసా? గొర్రె పేగులతో!! Images Credit: Pexels