సీజన్లను బట్టి వచ్చే కొన్ని రకాల పండ్లు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వాటిలో ఒకటి బేల్ పండు దీన్నే వెలగ పండు అంటారు. భారతదేశంలోని అత్యంత ప్రత్యేకమైన పండు ఇది. రుచిలో పుల్లగా ఉంటుంది. ఈ సూపర్ ఫ్రూట్ విరేచనాలు, డయేరియా వంటి జీర్ణ సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. మలబద్ధకం సమస్య నుంచి బయట పడేందుకు ఇదొక గొప్ప ఔషధంగా ప్రసిద్ధి చెందింది. మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలని బయటకి పంపించేస్తుంది. పేగు వ్యాధి ఐబీఎస్ లక్షణాలని తగ్గిస్తుంది. ఈ వుడ్ యాపిల్ జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఈ పండులో అధిక ప్రోటీన్ కంటెంట్ కారణంగా గాయాల్ని త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. బలమైన కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇందులోని బీటా కెరోటిన్ కాలేయ సమస్యల్ని నయం చేస్తుంది. Images Credit: Pixabay/ Food Blogger Sohani Eats/Instagram