బరువు త్వరగా తగ్గాలంటే వీటిని తాగండి



అధిక బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు కొన్ని రకాల పానీయాలు కచ్చితంగా తాగాలి.



కొన్ని రకాల పానీయాలు ఖాళీ పొట్టతో తాగాలి, మరికొన్ని ఆహారం తిన్నాక తాగాలి. ఎలాగైనా వీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారు.



ఆపిల్ సిడర్ వెనిగర్లో అసిటెక్ ఆమ్లం ఉంటుంది. ఇది త్వరగా బరువు తగ్గేలా చేస్తుంది. గోరువెచ్చటి నీటిలో ఒక స్పూను వేసి తాగాలి.



దాల్చిన చెక్క టీని తేనె వేసుకుని తాగడం అలవాటు చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు తాగితే మేలు జరుగుతుంది.



బ్లాక్ టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది.



బ్లాక్ కాఫీని వ్యాయామాలు చేసేటప్పుడు తాగితే మంచిదే. ఇది శక్తి స్థాయిలను పెంచుతుంది.



గ్రీన్ టీ తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. భోజనం తరువాత కూడా దీన్ని తాగవచ్చు.



అల్లం, నిమ్మ టీ... అంటే నీటిలో అల్లం తురుము వేసి బాగా మరిగించి, నిమ్మ రసం కలిపి పరగడుపున తాగాలి. ఇది బరువును త్వరగా తగ్గేలా చేస్తుంది.