ఎర్రగా యాపిల్ పండులాగా కనిపించే ఈ పండు పేరు పీచెస్. వేసవిలో లభించే పీచెస్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.



మామిడి, పుచ్చకాయ మాత్రమే కాదు సమ్మర్ లో లభించే మరొక జ్యూసీ ఫ్రూట్ పీచెస్.



జ్యూసీ ఉండటం మాత్రమే కాదు ఆరోగ్యకర ప్రయోజనాల పవర్ హౌస్ గా దీన్ని చెప్పవచ్చు.



పొటాషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి అనేక మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
కేలరీలు తక్కువ. శాచురేటెడ్ ఫ్యాట్ అసలు ఉండవు.


ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు పీచెస్ చాలా ఉపయోగపడతాయి.
మలబద్ధకం సమస్యని తొలగిస్తుంది.


గుండెకి మేలు చేసే అత్యుత్తమ పండ్లలో పీచెస్ ఒకటి. గుండెకి హాని కలిగించే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యల్ని తగ్గిస్తుంది.



క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉండే కెరొటీనాయిడ్స్, కెఫిక్ యాసిడ్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి.



పీచెస్ అలర్జీ వ్యాప్తిని నివారిస్తుంది.



పీచెస్ రక్షణ ప్రభావాలని కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.



పీచెస్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.
జీర్ణ సమస్యలు, పేగు వ్యాధి ఉన్న వాళ్ళు దీన్ని తినకపోవడమే మంచిది.