కూల్ డ్రింక్స్ తాగడం మానకపోతే కష్టాలు తప్పవు కూల్ డ్రింక్స్ అధికంగా తాగే వారిలో కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దీర్ఘకాలికంగా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. శీతలపానీయాల్లో చక్కెర అధికంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది. పొట్ట చుట్టు కొవ్వు చేరే అవకాశం ఎక్కువ. కాబట్టి శీతలపానీయాలు మానేయాలి. కూల్ డ్రింక్స్ అధికంగా తాగితే ఫాస్పోరిక్ యాసిడ్ శరీరంలో చేరుతుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి. దంతాలపై ఎనామిల్ పొర పోవడానికి ఈ పానీయాలు కారణం అవుతాయి. కూల్ డ్రింక్స్ వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. గుండె సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు పూర్తిగా కూల్ డ్రింక్స్ మానేయాలి.