లావుగా ఉన్న ఉద్యోగులతో లాభం లేదా? అధిక బరువు, ఊబకాయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ఈ అధ్యయనం ప్రకారం ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్న ఉద్యోగులు సరిగా పనిచేయలేరు. వారి ఉత్సాదకత తక్కువగా ఉంటుంది, ఇది కంపెనీల ఖర్చులను పెంచుతుంది. ఊబకాయం ఉన్నవారు త్వరగా అనారోగ్యాలకు గురవుతారని, దీనివల్ల సెలవులు అధికంగా పెడతారని, వారు ఉత్పాదకత తక్కువ అవుతుందని ఈ అధ్యయనం సారాంశం. అమెరికాలోని చికాగోకు చెందిన ఎండోక్రైన్ సొసైటీ వార్షిక కాన్ఫరెన్స్‌లో ఈ అధ్యయనం తాలూకు వివరాలను వెల్లడించారు పరిశోధకులు. ఈ పరిశోధనలో భాగంగా 7,19,482 మంది ఉద్యోగులను పరిశోధకులు విశ్లేషించారు. వీరంతా కూడా అధిక బరువుతో బాధపడుతున్న వారే. ఇతర ఉద్యోగులతో పోలిస్తే అధిక బరువు ఉన్న ఉద్యోగుల ఉత్పాదకత తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనంలో తేలింది. ప్రపంచంలో ఊబకాయం బారిన పడిన వారి జనాభా అధికంగా ఉన్న దేశం అమెరికా.