బహుముఖ ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఆమ్లా లేదా ఉసిరి భారతీయ మూలికల్లో ఒకటి. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఉసిరిలో 600-700 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ విటమిన్ సి ఉన్నందున ఆమ్లా రెండవ అతిపెద్ద సహజమైన విటమిన్ సి అందించే పండుగా పేరొందింది. కానీ దీన్ని అతిగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు కలిగిస్తుంది. పచ్చి పండ్లు అతిగా తింటే గుండెల్లో మంటను పెంచుతుంది. ఉసిరిలో యాంటీ ప్లేట్ లెట్ లక్షణాలు కలిగి ఉంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. ఉసిరి అతిగా తినడం వల్ల హైపోక్సేమియా లేదా రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఏర్పడే పరిస్థితి తలెత్తుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నవారు అంటే హైపోగ్లైసిమియా పరిస్థితి ఉన్న వాళ్ళు తీసుకోకపోకూడదు. ఇది పోషకాలు కలిగినప్పటికీ ఇందులోని అదనపు ఆమ్లాలు గర్భిణీ, పాలిచ్చే తల్లుల ఆరోగ్యానికి హానికరం. Images Credit: Pixabay/ Pexels/ Unsplash