పచ్చి ఉల్లిపాయ తింటే నెలసరి నొప్పులు తగ్గుతాయి



ఎంతోమంది మహిళలు నెలసరి సమయంలో ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.



పొట్టలో తిప్పినట్లు, తిమ్మిరి పట్టినట్లు అనిపిస్తుంది. తీవ్రమైన నొప్పితో బాధపడే వారు కూడా ఎంతోమంది.



ఈ నెలసరి సమస్యల నుంచి ఉపశమనం కలగాలంటే ప్రతిరోజు ఒక పచ్చి ఉల్లిపాయను తినడం అలవాటు చేసుకోవాలి.



క్రమ పద్ధతిలో నెలసరి రాకపోయినా పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల మేలు జరుగుతుంది.



డయాబెటిక్ రోగులు రోజూ ఉల్లిపాయను తినడం అలవాటు చేసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.



గుండె ఆరోగ్యానికి పచ్చి ఉల్లిపాయలు ఎంతో మేలు చేస్తాయి. రక్తం గడ్డ కట్టడం వంటివి జరగకుండా అడ్డుకుంటాయి.



పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది.



పచ్చి ఉల్లిపాయ తినడం అలవాటు చేస్తే వారు త్వరగా జలుబు, జ్వరం, దగ్గు వంటి వాటి బారిన పడకుండా ఉంటారు.