ఈ ఆహారాలు తింటే డిప్రెషన్ పెరిగిపోతుంది డిప్రెషన్ బారిన పడిన వారు ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు తినకూడదు. నూడుల్స్, ఫ్రైడ్ రైస్ వంటి ఆహారాలు తినకూడదు. పంచదారతో చేసిన పదార్థాలను దూరం పెట్టాలి. ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్లను వాడకూడదు. పిజ్జా, బర్గర్ల, హాట్ డాగ్ వంటి వాటిల్లో ఉండే ప్రాసెస్డ్ మాంసం తినకూడదు. ఆల్కహాల్ తాగడం మానేయాలి. ఉప్పును తగ్గించి ఆహారాలు తినాలి. పైన చెప్పి అన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలను పెంచేస్తాయి.