లిచీ పండ్లను డయాబెటిక్ రోగులు తినవచ్చా? ఎర్రని తొక్కతో లోపల తెల్లని జెల్లీ లాంటి గుజ్జుతో కనిపించే లిచీ పండ్లకు అభిమానులు ఎక్కువ. లిచీ పండ్లు సహజంగానే తీపి చక్కెరను కలిగి ఉంటాయి. వీటిని అధికంగా తినడం వల్ల ఊబకాయం వారిన త్వరగా పడతారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉండాలి. లేకుంటే పరిస్థితులు చేజారే అవకాశం ఉంది. అధిక రక్తపోటు ఉన్నారు ఉన్నవారు రోజుకు రెండు మూడు లిచీ పండ్లను తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. అధికంగా తింటే మాత్రం రక్తపోటు చాలా తగ్గిపోతుంది. దీనివల్ల నీరసం, మూర్ఛ, అలసట వంటివి వస్తాయి. రక్తపోటు పడిపోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ పండ్లను అధిక మోతాదులో తినడం వల్ల అనేక అలర్జీలు కలిగే అవకాశం ఉంది. దురద, వాపు, ఎరుపుగా మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం వంటివన్నీ కూడా లిచీపండ్ల వల్ల కలుగుతాయి. ముఖ్యంగా గర్భిణులు, గర్భం ధరించేందుకు ప్రయత్నిస్తున్న వారు ఈ పండ్లకు దూరంగా ఉండాలి.