ఆర్టిఫిషియల్ షుగర్ మీ శరీరంలో చేసేది ఇదే చక్కెర ఇష్టం లేని వారు ఆర్టిఫిషియల్ షుగర్ వాడుతూ ఉంటారు. డయాబెటిస్ ఉన్న వారు కూడా ఆర్టిఫిషియల్ షుగర్ బిళ్లలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల డీఎన్ఏ దెబ్బ తింటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని పరిశోధకులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ స్వీటెనర్లను సోడాలు, చూయింగ్ గమ్, ఫ్రొజెన్ డిజర్టులలో వీటిని వాడతారు. వీటిని దీర్ఘకాలికంగా వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని పెంచుతాయి. గుండెకు హాని చేసే ట్రైగ్లిజరైడ్స్ వంటివి పెరిగే అవకాశం ఉంది.