పచ్చిమిర్చి తినమంటే వామ్మో మంట అని పక్కన పెట్టేస్తారు కానీ దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు. ఇందులోని క్యాప్సిపైన్ అనే సమ్మేళనాన్ని జాయింట్స్, కండరాల నొప్పులు తగ్గించే క్రీమ్స్ లో వాడతారు. మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇందులోని ధర్మోజెనిక్ ప్రాపర్టీస్ వల్ల బరువు తగ్గుతారు. విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ ఏ, సి, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. మొత్తం ఆరోగ్య శ్రేయస్సుకి ఇవి తోడ్పడతాయి. విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఆక్సీడేటివ్ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. Images Credit: Pixabay/ Pexels