జీవితంలో ఎన్నిసార్లు రక్తదానం చేయచ్చో తెలుసా?



2004లో తొలిసారి ప్రపంచ రక్త దాన దినోత్సవాన్ని ప్రారంభించారు.



రక్తదానం చేయడం పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆ రోజు ఎన్నో కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.



పురుషులు ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చు.



మహిళలు ఆరునెలలకోసారి రక్తదానం చేయవచ్చు.



జీవిత కాలంలో ఒక వ్యక్తి దాదాపు 168 సార్లు రక్తదానం చేయవచ్చు.



హిమోగ్లోబిన్ 12.5 గ్రాములు ఉన్న వారు మాత్రమే రక్తాన్ని దానం చేయచ్చు.



రక్తదానం చేయాలనుకునే వ్యక్తికి 18 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు వయసు ఉండాలి.



రక్త దానం చేయడం వల్ల పాత రక్తం బయటకు పోయి, కొత్త రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.