ఇటీవలి కాలంలో ఓట్స్ వినియోగం ఎక్కువగానే కనిపిస్తుంది. ఓట్స్ ఉత్తమమైన అల్పాహార ఎంపికలో ఒకటి. ఇవి సంతృప్తిని కలిగిస్తాయి. రోజంతా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఒక గిన్నె ఓట్స్ తో రోజును ప్రారంభించడం వల్ల శక్తిని పొందుతారు. ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ లు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన బరువు కావాలని అనుకుంటే మార్నింగ్ డైట్ చార్ట్ లో ఓట్స్ ఉండేలా చూసుకోండి. ఇవి తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ని కలిగి ఉంటాయి. ఓట్స్ డైటరీ ఫైబర్ మూలం. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. ప్రతిరోజూ ఓట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు, హార్ట్ స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారికి ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తుంది. మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ బి1 తో సహ ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. శక్తి ఉత్పత్తి, ఎముకల ఆరోగ్యం, మెదడు పనీతిరు వంటి శారీరక విధులకు మద్దతు ఇవ్వడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.