కుంకుమ పువ్వుతో మానసిక ఆరోగ్యం హిమాలయాల్లో పండే అరుదైన, ఖరీదైన పంట కుంకుమ పూరేకులు. అక్కడ్నించే దేశంలోని నలుమూలలకి కుంకుమ పూలు ఎగుమతి అవుతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకునే వారి సంఖ్య చాలా తక్కువ. మానసిక ఆరోగ్యానికి కుంకుమపువ్వు ఎంతో మేలు చేస్తుంది. ఇది యాంటీ డిప్రెసింట్‌గా పనిచేస్తుంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జలుబు, జ్వరం వంటివి త్వరగా తగ్గుతాయి. వీటిలో కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కుంకుమపువ్వులో రిబోఫ్లావిన్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి సహాయపపడతాయి. వీటిని తినడం వల్ల నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మ సౌందర్యానికి కూడా కుంకుమ పువ్వు చాలా అవసరం. ఇది సహజసిద్ధంగా మన చర్మానికి మెరుపును అందిస్తుంది. చర్మంపై వచ్చే మొటిమలను కూడా తగ్గిస్తాయి.