దగ్గు తగ్గాలా? లవంగం తినండి ప్రతి భారతీయ వంటగదిలో కచ్చితంగా ఉండే మసాలా దినుసు లవంగం. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. రోజుకో లవంగం నమలడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. లవంగాలు తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది రక్త ప్రసరణను సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఇవి జీర్ణక్రియ సమస్యలను కూడా తగ్గిస్తాయి. గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటివి రాకుండా అడ్డుకుంటాయి. దీనిలో యాంటీ బాక్టిరియల్ లక్షణాలు అధికం. వీటిని తినడం వల్ల దగ్గు తగ్గుతుంది. దీనిలో యాంటీ సెప్టిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇన్ఫెక్షన్లు, కాలిన గాయాలు త్వరగా తగ్గుతాయి. కండరాల నొప్పుల నుంచి లవంగాలు త్వరగా బయటపడేలా చేస్తాయి.