కలబందతో అలెర్జీలు వచ్చే అవకాశం



ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఔషధ మొక్క కలబంద. దాదాపు అన్ని ఇళ్లల్లో కుండీలో కలబందను పెంచుతూనే ఉంటారు.



కలబంద అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని చెబుతుంది ఆయుర్వేదం.



అయితే కొంతమందిపై ఇది చెడు ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.



కలబంద నుంచి ఉత్పత్తి అయ్యే రబ్బరు పాలు చర్మానికి తగిలినప్పుడు అవి అలర్జీలను కలిగించే అవకాశం ఉంది.



ఈ అలెర్జీ వల్ల పొట్ట తిమ్మిరి, పొటాషియం స్థాయిలు పడిపోవడం వంటివి జరగవచ్చు.



అలోవెరా జెల్ పడకపోతే చర్మ అలెర్జీలు, దద్దుర్లు, మండుతున్న ఫీలింగ్ వచ్చే అవకాశం ఎక్కువ.



కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల చక్కెరస్థాయిలు తీవ్రంగా పడిపోయే అవకాశం ఎక్కువ. కాబట్టి తక్కువగానే దీన్ని తాగాలి.



అలోవెరాను అధికంగా తాగితే డిహైడ్రేషన్ సమస్య కూడా వస్తుంది. కాబట్టి వేసవిలో అలోవెరా ఆహారంలో భాగం చేసుకోకపోవడమే మంచిది.