ఈ పండును కూడా తినాల్సిందే యాపిల్, కివీ, పుచ్చకాయ, ఆరెంజ్ వంటి పండ్లను తినడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. కానీ తర్భూజా (మస్క్ మెలన్) తినడానికి మాత్రం ఇష్టపడరు. నిజానికి ఈ పండును కూడా కచ్చితంగా తినాల్సిందే. పుచ్చకాయలాగే మస్క్ మెలన్ కూడా శరీరాన్ని తేమవంతంగా ఉంచుతుంది. కాబట్టి వేసవిలో దీన్ని తినాలి. బరువు తగ్గాలనుకునేవారు మస్క్ మెలన్ డైట్ లో చేర్చుకోవాలి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పొట్ట నిండిన భావనను అందిస్తుంది. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడడలో ఈ పండు ముందుంటుంది. దీని శీతలీకరణ లక్షణాలను చూపిస్తుంది. గుండెకు మస్క్ మెలన్ ఆరోగ్యాన్ని అందిస్తుంది. అధికరక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ పండు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది స్ట్రెస్ రిలీవింగ్ ఫుడ్. ఈ పండును జ్యూస్ చేసుకుని తాగినా మంచిదే.