సీతాఫలాలతో క్యాన్సర్‌కు చెక్



సీతాఫలాలు అంటే ఎంతో మందికి ఇష్టం. తీపి రుచితో నోరూరించేలా ఉంటాయి.



సీతాఫలాలు తినడం వల్ల శరీరంపై పడే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే క్యాన్సర్, గుండె వ్యాధులు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది.



ఈ పండ్లలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండ్లు తిన్నాక శరీరంలో డోపమైన్ ఉత్పత్తి అవుతుంది.



డోపమైన్ అనేది ఒక సంతోషకరమైన హార్మోను. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.



ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలతో బాధపడే వారికి ఈ పండు మంచి ఫలితాన్ని ఇస్తుంది.



సీతాఫలాలలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. అధిక రక్తపోటును తగ్గించడానికి ఇవి చాలా సాయపడతాయి.



హై బీపీతో బాధపడుతున్న వారు, గుండె సమస్యల బారిన పడిన వారు సీతాఫలాలను కచ్చితంగా తినాలి.



సీతాఫలంలో ఉండే సమ్మేళనాలు క్యాన్సర్ తో పోరాడే శక్తిని ఇస్తాయి.