వర్షాకాలంలో ఇంటితోపాటు పరిసరాల పరిశుభ్రత కూడా తప్పనిసరి. వంటిల్లును మరింత శుభ్రంగా ఉంచుకోవాలి. తాజాగా వండిన వేడి వేడి పదార్థాలు మాత్రమే తినాలి. తరచుగా చేతులు కడుక్కోవడం తప్పని సరి. తేమ వాతావరణంలో సూక్ష్మ జీవులు ఎక్కువ. దోమలు పెరగకుండా జాగ్రత్తలు పాటించాలి. ఒళ్ళంతా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. నీరు నిలిచి ఉండకుండా చూసుకోవాలి వర్షంలో బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు, రెయిన్ కోట్ వంటివి ఉపయోగించాలి. నాన్ స్లిప్ లేదా రెయిన్ బూట్లను వాడాలి. తాగు నీటి విషయంలో జాగ్రత్త. నీటి సంక్రమణ ప్రమాదం ఈ కాలంలో ఎక్కువ.