క్యాబేజీ దోశె ఇలా చేయండి



బియ్యం - రెండు కప్పులు
ఎండు మిర్చి - రెండు
ఉల్లిపాయ - ఒకటి
జీలకర్ర - రెండు స్పూన్లు



చింతపండు - చిన్న ఉండ
కొత్తిమీర - ఒక కట్ట
క్యాబేజీ - కప్పు
కొబ్బరి ముక్కలు - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత



బియ్యం రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ బియ్యంలో జీలకర్ర, కొత్తిమీర, కొబ్బరి, చింతపండు వేసి రుబ్బాలి.



ఆ పిండిని గిన్నెలో వేసి ఉల్లిపాయల తరుగు, క్యాబేజీల తరుగు వేసి కలపాలి.



బియ్యం మిశ్రమంలో కాస్త నీళ్లు పోసి ఉండల్లేకుండా బాగా కలపాలి.



స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. తరువాత పిండితో దోశెలు వేసుకోవాలి.



ఆ దోశెలను కొబ్బరి చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.