చుండ్రుని ఇలా వదిలించుకోండి చుండ్రు ఎక్కువ శాతం మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈ సమస్య నుంచి కొన్ని ఇంటి చిట్కాలతో చుండ్రుని, దురదను వదిలించుకోవచ్చు. యాపిల్ సిడర్ వెనిగర్ ఒక స్పూను, నీళ్లు ఒక స్పూను కలిపి ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువ. షాంపూలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి తలకు రుద్దుకోవాలి. తలస్నానం చేసే షాంపూలో ఒక స్పూను బేకింగ్ సోడా కలిపి మాడుకు పట్టించి, తరువాత శుభ్రపరుచుకోవాలి. అలొవెరాలో యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ గుణాలు ఎక్కువ. కలబంద గుజ్జును మాడుకు పట్టించాలి. అరగంట తరువాత శుభ్రపరచుకోవాలి. తలస్నానానికి ముందు కొబ్బరి నూనెతో మర్ధనా చేసుకోవాలి. గంట తరువాత తలకు స్నానం చేయాలి. నిమ్మరసం, నీళ్లు సమపాళలో కలిపి తలకు పట్టించాలి. ఇలా తరచూ చేస్తుంటే చుంద్రడు తగ్గిపోతుంది.