డయాబెటిస్ ఉంటే ఈ బియ్యాన్ని తినండి



డయాబెటిస్ వచ్చిన వారికి అన్నం ఎక్కువగా తినకూడదని చెబుతారు. అది ఒక శాపమనే చెప్పాలి.



మధుమేహం ఉన్న వారికి ఇప్పుడు ఒక శుభవార్త. వారు జోహా రకం బియ్యాన్ని ఎంతైనా తినవచ్చు.



ఇది మధుమేహం నియంత్రించడంలో సహాయపడుతుందని కొత్త అధ్యయనం చెబుతోంది.



అసోంలో ప్రత్యేకంగా జోహా రకం బియ్యాన్ని పండిస్తారు. దీంతో రైస్ బ్రాన్ ఆయిల్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.



జోహా రకం బియ్యాన్ని తినే వ్యక్తుల్లో మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు తక్కువగా వచ్చే అవకాశం ఉంది.



ఈ బియ్యం నుంచి ఒక రకమైన సువాసన కూడా వస్తుంది. ఈ బియ్యంలో రెండు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు లినోలేయిక్ ఆమ్లం, లినోలెనిక్ ఆమ్లం ఉంటాయి.



ఇతర రకాల బియ్యాలతో పోలిస్తే జోహా రైస్‌లో ఒమేగా6 ఆమ్లాలు సమతుల్య నిష్పత్తి లో కలిగి ఉంటాయి.



మధుమేహం ఉన్నవారు ఈ బియ్యాన్ని అనేక రకాలుగా వండుకొని తినవచ్చు.