విటమిన్ డి లోపంతో పిల్లల్లో మధుమేహం? గర్భం ధరించిన సమయంలో ఎంత పోషకాహారాన్ని తింటే బిడ్డకు అంత మంచిది. వైద్యులు ఇచ్చిన సప్లిమెంట్లను కూడా ఖచ్చితంగా వాడాలి. గర్భిణుల్లో విటమిన్ D లోపం ఉంటే పిల్లలకు మధుమేహం త్వరగా వచ్చే అవకాశం ఉందని అధ్యయనం చెబుతుంది. విటమిన్ డి లోపం వల్ల పుట్టిన పిల్లల్లో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. గర్భిణులు విటమిన్ డి లోపం బారిన పడడం వల్ల వారిలో ఎదుగుతున్న పిండంలో రోగనిరోధక కణాలు కూడా దెబ్బతింటాయి. ఈ లోపం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. త్వరగా చిరాకు కోపం వస్తాయి. డిప్రెషన్ బారిన పడే అవకాశం కూడా ఎక్కువ. విటమిన్ డి లోపం వల్ల నడుము నొప్పి ఎక్కువగా వేధిస్తుంది. కాళ్లు, కీళ్లలో నొప్పి అధికంగా వస్తుంది. ఈ కొత్త అధ్యయనాన్ని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారు నిర్వహించారు.