బ్రకోలి ఎంత తిన్నా బరువు పెరగరు బ్రకోలి ఆరోగ్యకరమైన ఆకుకూర. కచ్చితంగా తినాల్సిన ఆహారం కూడా. దీన్ని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బ్రకోలీలో విటమిన్ సి, కె, ఎ అధికంగా ఉంటాయి. ఫోలేట్, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరంలో ఇన్‌ఫ్లమ్మేషన్ రాకుండా అడ్డుకుంటుంది. గుండెకు బ్రకోలీలో ఉండే పోషకాలు రక్షణ కల్పిస్తాయి. గుండెకు రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం, అజీర్తి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. బ్రకోలీలో ఉండే పోషకాలు రొమ్ము, ప్రొస్టేట్, ఊపిరితిత్తులు, పెద్దపేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. కళ్లకి బ్రకోలీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో లుటీన్, జియాక్సంతిన్ వంటివి కళ్లకు రక్షణ కల్పిస్తాయి. బ్రకోలీని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఎంత తిన్నా బరువు పెరగరు.