అన్వేషించండి

Periods: నెలసరి సమయంలో అధికంగా రక్తస్రావం అవుతుందా? దానికి ఇవి కారణాలు కావచ్చు

ప్రతినెలా భారీ రక్తస్రావం అవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Periods:  మహిళల జీవితంలో నెలసరి చాలా ముఖ్యమైనది. ప్రతినెలా ఋతుస్రావం కావాల్సిందే. ఒక్క నెల జరగకపోయినా ఆరోగ్యంలో ఏదో తేడా వచ్చిందని అర్థం చేసుకోవాలి. అయితే వేలాది మంది భారతీయ మహిళలను ప్రభావితం చేస్తున్న సమస్య ‘రక్తస్రావం అధికంగా జరగడం’. ఇలా ప్రతి నెలా జరగడం వల్ల బలహీనతతో పాటు రక్తహీనత సమస్యలు వస్తాయి. శరీరం పట్టు తప్పుతుంది. ఇలా సాధారణం కన్నా అధికంగా రక్తస్రావం అయ్యే సమస్యను మెనోరాగియా అంటారు. ఈ సమస్య ఉన్నవారిలోనే భారీ రక్తస్రావంతో పాటు ఏడు రోజులు కన్నా ఎక్కువ కాలం పాటు నెలసరి ఉంటుంది. మెనోరాగీయ వ్యక్తిగత జీవితాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తున్నప్పుడు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. ఇది రావడానికి కొన్ని కారణాలు ఉండే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హార్మోన్ల అసమతుల్యత
ఎక్కువ మంది మహిళలు ఇబ్బంది పడుతున్న సమస్య ‘హార్మోన్ల అసమతుల్యత’. హార్మోన్ల ఉత్పత్తి స్థాయిలలో హెచ్చుతగ్గులు ఉండడం... ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ వంటి హార్మోన్లు అసమతుల్యంగా ఉండడం వల్ల సాధారణ రుతుక్రమానికి ఇవి అంతరాయం కలిగిస్తాయి. దీనివల్ల అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.

గర్భాశయ ఫైబ్రాయిడ్లు
గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఏర్పడడం వల్ల కూడా భారీ రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. గర్భాశయంలో గడ్డల్లాంటివి ఏర్పడతాయి. దీనికి కచ్చితంగా చికిత్స అవసరం.

పాలిప్స్
ఇవి గర్భాశయంలోపలే ఏర్పడతాయి. ముఖ్యంగా గర్భశయ లైనింగ్ పై చిన్నచిన్న గడ్డల్లా పెరుగుతాయి. వీటి వల్ల కూడా అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.

అడెనోమియాసిస్
గర్భాశయ లైనింగ్‌ను ఎండోమెట్రియం అంటారు. ఈ గర్భాశయం కండరాల గోడల్లోకి అసాధారణంగా పెరుగుతున్నప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది.  రక్తస్రావం అధికంగా జరుగుతుంది. దీనికి కూడా కచ్చితంగా చికిత్స అవసరం.

రక్తం గడ్డ కట్టే వ్యాధులు
కొందరిలో రక్తం గడ్డ కట్టడాన్ని ప్రభావితం చూసే కొన్ని వైద్య పరిస్థితులు ఉంటాయి. అలాంటి రోగాల బారిన పడిన వారికి కూడా నెలసరి సమయంలో భారీ రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.

పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీస్
దీనిని PID అని కూడా పిలుస్తారు. దీనివల్ల పునరుత్పత్తి అవయవాల్లో ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీనితో అధిక రక్తస్రావం జరుగుతూ ఉంటుంది.

అధికంగా రక్తస్రావం జరగడం వల్ల ఇనుము వంటి ముఖ్యమైన పోషకాలు బయటికి పోతాయి. దీనివల్ల శరీరం అలసట, బలహీనత బారిన పడుతుంది. రక్తాన్ని భారీగా కోల్పోవడం వల్ల శ్వాస ఆడక పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే మైకం కమ్మడం, తలనొప్పి రావడం వంటి లక్షణాలు కూడా వస్తాయి.

ప్రతి నెలా అధిక రక్తస్రావం జరగడానికి కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు కారణాన్ని కనిపెట్టి తగిన చికిత్సను అందిస్తారు. 

Also read: ఈ కుక్క పిల్లల మధ్య ఒక బంతి దాగుంది, దాన్ని పది సెకన్లలో కనిపెడితే మీ కంటి చూపు సూపర్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడుభారత్ వీర విధ్వంసం, సఫారీ గడ్డపైనే రికార్డు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Game Changer: ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Sharmila: ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
Embed widget