Optical Illusion: ఈ కుక్క పిల్లల మధ్య ఒక బంతి దాగుంది, దాన్ని పది సెకన్లలో కనిపెడితే మీ కంటి చూపు సూపర్
ఆప్టికల్ ఇల్యూషన్ అంటే ఆసక్తి చూపించే వారి కోసమే ఈ కథనం.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యుషన్‌లు కళ్ళ ముందే కనిపిస్తున్న నిజాన్ని కూడా భ్రమలా మార్చేస్తాయి. అందుకే వాటిని ఆడేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు మరొక ఆప్టికల్ ఇల్యూషన్ తీసుకొచ్చాం. ఇక్కడ ఇచ్చిన చిత్రంలో కుక్కలతో పాటు వివిధ రకాల బొమ్మలు, బట్టలు, వంటకాలు ఎన్నో వస్తువులు ఉన్నాయి. వాటిలోనే ఒక బంతి కూడా దాగుంది. దాన్ని మీరు కనిపెట్టి ఎక్కడ ఉందో చెబితే మీరు తెలివైన వారనే అర్థం. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. కానీ మీ ముందున్న టైం కేవలం 10 సెకన్లు. ఈ 10 సెకన్లలో జవాబు కనిపెడితే మీ కంటి చూపు, మీ మెదడు సమన్వయం చాలా చక్కగా ఉందని అర్థం చేసుకోవచ్చు.
కుక్కల మధ్య ఉన్న బంతిని కనిపెట్టిన వారికి అభినందనలు. పది సెకన్లలోనే మీరు ఆ బంతిని కనిపెట్టి ఉంటే మీ పరిశీలనా నైపుణ్యాలు అదిరిపోయినట్టే లెక్క. మీరు గద్ద లాంటి కంటే కంటి చూపును కలిగి ఉన్నారని అర్థం. ఒకవేళ మీరు బంతిని కనుగొనలేదా? మరి కొంచెం సమయం తీసుకుని ప్రయత్నించండి. ఎప్పటికీ ఆ బంతిని కనిపెట్టకపోతే జవాబు కిందనే ఇచ్చాము చూడండి. బంతి ఇంకెక్కడో లేదు ఆ కుక్క వెనకే దాక్కొని ఉంది. సగం బంతి కుక్క వెనక ఉంటే, సగం బంతి బయటకు కనిపిస్తోంది. సరిగ్గా చూస్తే దాన్ని మీరు గుర్తించవచ్చు.
ఆప్టికల్ ఇల్యూషన్లు పిల్లలకు, పెద్దలకు ఎంతో నచ్చే పజిల్. ఇవి కళ్లను మాయ చేసి, మెదడుకు పని పెడుతుంది. ఇవి ఈనాడు మొదలైనవి కావు. ప్రాచీన కాలంలో ఎలాంటి వినోద కార్యక్రమాలు లేని కాలంలో ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు ప్రజలను చాలా అలరించాయని చెబుతారు. వీటిని మొదట రూపొందించింది ఎవరో గుర్తించలేకపోయారు చరిత్రకారులు. అతనికి మనమంతా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇంత గొప్ప కళను, వినోదాన్ని మనకు అందించినందుకు. ఇవి మెదడును చురుగ్గా మారేందుకు ఉపయోగపడతాయి. సోషల్ మీడియా వచ్చాక ఇవి చాలా ఆదరణ పొందాయి. ఎన్నో ఆప్టికల్ ఇల్యూషన్లు సోషల్ మీడియాలో ఆదరణ పొందాయి. ఎంతో మంది చిత్రకారులు ప్రస్తుతం వీటిని చిత్రీకరిస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ లో వీటి కోసం ప్రత్యేక పేజీలు కూడా ఉన్నాయి. కింద ఇచ్చిన ఇన్ స్టాగ్రామ్ ఖాతలో ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు అధికంగానే ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు వాటిని సాల్వ్ చేసుకోవచ్చు.
">
Also read: చెవి పోటు తరచూ వచ్చి ఇబ్బంది పెడుతోందా? ఇలా ఇంటి చిట్కాలతో తగ్గించుకోండి
Also read: ఏటా పెరిగిపోతున్న రొమ్ము క్యాన్సర్ కేసులు, హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ